14 May, 2026 | 1:42 AM

జమ్మికుంట మార్క్‌ఫెడ్ మక్కల కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి

14-05-2026 12:42 AM

జమ్మికుంట మే13 (విజయక్రాంతి): జమ్మికుంట పత్తి మార్కెట్లోని మార్క్ఫెడ్ మక్కల కొనుగోలు కేంద్రాన్ని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి బుధవారం పరిశీలించారు. మార్క్ఫెడ్ మక్కల  కొనుగోలుపై రైతులని అడిగి తెలుసుకున్నారు. కొనుగోలు జాప్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ... . కొనుగోళ్ల జాక్యంతో మార్కెట్లో సుమారు 40 వేల మక్కల బస్తాలు పేరుకుపోయాయని చెప్పారు.

కొనుగోళ్లు వెంటనే వేగవంతం చేయాలని లేనియెడల రైతులతో కలిసి ఆందోళన చెందుతున్నారని హెచ్చరించారు. అనంతరం మార్కెట్ పాలక వర్గం, ఆర్డీఓ, మార్క్ఫెడ్ ఎండి, అధికారులు, రైతులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. కొనుగోళ్ల ప్రక్రియ పారదర్శకంగా జరగాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టం చేశారు. ఇక్కడ ఎమ్మెల్యే వెంట మున్సిపల్ చైర్మన్ ములుగు దిలీప్ కుమార్, బీ ఆర్‌ఎస్ నాయకులు కార్యకర్తలు ఉన్నారు.