ప్రేమ పేరుతో మోసం.. ఎస్‌ఐ అరెస్ట్
కూకట్‌పల్లి, మే 13(విజయక్రాంతి): ప్రేమ పేరుతో మహిళా కానిస్టేబుల్‌ను నమ్మించి మోసం చేసిన కూకట్‌పల్లి ఎస్‌ఐ సురేష్‌ను పోలీసులు బుధవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్లో సురేష్ ఎస్‌ఐగా విధులు నిర్వహిస్తున్న సమయంలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న మహిళా కానిస్టేబుల్‌తో ప్రేమ వ్యవహారం నడిపి పెళ్లి చేసుకుంటానని నమ్మించి సన్నిహితంగా మెదిలాడు.
కొంతకాలం తర్వాత సురేష్ ఉద్యోగరీత్యా మరొక ప్రాంతానికి బదిలీ అవడంతో మహిళా కానిస్టేబుల్ సురేష్‌ను పెళ్లి చేసుకుందామని ఒత్తిడి చేసింది. దీంతో అతను ముఖంచాటేశాడు. వివాహం చేసుకోవాలని ఒత్తిడి పెంచడంతో ఇద్దరి మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి.
చివరికి పెళ్లి చేసుకోనని తేల్చిచెప్పడంతో బాధితురాలు మహిళా కానిస్టేబుల్ కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం కొల్లూరులో విధులు నిర్వహిస్తున్న సురేష్‌పై శాఖపరమైన చర్యలు తీసుకుంటూ సస్పెండ్ చేశారు. అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.






