మఠంపల్లి ఎస్‌ఐగా ప్రవీణ్ కుమార్ బాధ్యతలు స్వీకరణ
14-05-2026 01:38 AM
మఠంపల్లి, మే 13 : మఠంపల్లి ఎస్‌ఐగా బి.ప్రవీణ్ కుమార్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. మునగాలలో పనిచేస్తూ మఠంపల్లికి బదిలీపై వచ్చారు. ఇక్కడ ఎస్త్స్ర గా పనిచేస్తున్న పి.బాబు నల్గొండ వీఆర్ కు బదిలీ అయ్యారు. నూతన ఎస్త్స్ర గా బాధ్యతలు స్వీకరించిన ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ మండల ప్రజలకు అందుబాటులో ఉంటూ శాంతి భద్రతలు పరిరక్షించడానికి కృషి చేస్తానని, శాంతి భద్రతల పరిరక్షణకు ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు. అక్రమ వ్యాపారాలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, మండలంలో ఎలాంటి ఫిర్యాదులు ఉన్న నేరుగా పోలీసు స్టేషన్ లో సంప్రదించాలన్నారు.






