14 May, 2026 | 2:48 AM

గరిడేపల్లి ఎస్‌ఐగా శ్రీకాంత్ గౌడ్ బాధ్యతల స్వీకరణ

14-05-2026 01:37 AM

గరిడేపల్లి, మే 13 : గరిడేపల్లి ఎస్‌ఐగా బత్తిని శ్రీకాంత్ గౌడ్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. జిల్లాలోని ఆత్మకూరు ఎస్ పోలీస్ స్టేషన్లో ఎస్‌ఐగా పనిచేస్తున్న శ్రీకాంత్ గౌడ్ బదిలీపై గరిడేపల్లి పోలీస్ స్టేషన్ కి వచ్చారు. ఇక్కడ పనిచేస్తున్న ఎస్‌ఐ చలికంటి నరేష్ హుజూర్ నగర్ కు బదిలీపై వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు తనవంతు కృషి చేస్తానన్నారు.