బక్రీద్ పండుగను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలి
14-05-2026 12:44 AM
జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్,ఎస్ పి అశోక్ కుమార్
జగిత్యాల, మే 13 (విజయక్రాంతి): జగిత్యాల జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్, ఎస్ పి అశోక్ కుమార్ లు బక్రీద్ పండుగ నిర్వహణపై శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా వివిధ స్థాయిల అధికారులు, మత పెద్దలు, ముస్లిం మరియు హిందూ ప్రతినిధులతో సమావేశమై ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలు, ఆదేశాలకు అనుగుణంగా పండుగను శాంతియుతంగా, సౌహార్ద వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు.
బక్రీద్ సందర్భంగా ప్రజలు పరస్పర సహకారంతో సామరస్యాన్ని కాపాడాలని తెలిపారు. సంబంధిత శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండి అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు.ఈ కార్యక్రమం లో అడిషనల్ కలెక్టర్, డి ఎస్ పి లు, సీఐ లు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.






