4 August, 2026 | 2:33 AM

బోనాల ఉత్సవాల సందర్బంగా ఎమ్మెల్యే సమీక్ష సమావేశం

04-08-2026 12:04 AM

కూకట్‌పల్లి, ఆగస్టు 3 (విజయక్రాంతి): కూకట్ పల్లి చిత్తరమ్మ, ముసాపేట పోచమ్మ ఆలయాలలో ఈనెల 9 న జరుగనున్న బోనాల ఉత్సవాల  ఏర్పాట్లపై కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణా రావు కూకట్ పల్లి రామాలయం లో అధికారులతో  సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. చిత్తారమ్మ, పోచమ్మ దేవాలయాల వద్ద ఆదివారం జరుగనున్న బోనాల ఉత్సవాలలో ప్రజలకు ఎటువంటి అసౌకర్యాలు లేకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు.

బోనాల ఉత్సవాల సందర్భంగా  ఆలయాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలన్నారు . ట్రాఫిక్, శానిటేషన్, విద్యుత్ సరఫరా, శాంతి భద్రతల విషయంలో ప్రత్యేక దృష్టిసారించాలని అధికారులను ఆదేశించారు. ఆలయ పరిసరాలను ఎప్పటికప్పుడు బ్లీచింగ్ తో పరిశుభ్రంగా ఉంచాలని సిఎంసి  శానిటేషన్ విభాగం అధికారులకు సూచించారు. ఉత్సవాలు పూర్తయ్యే వరకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని పేర్కొన్నారు.

ఉత్సవాల సందర్భంగా ఏవైనా ఇబ్బందులు తలెత్తితే తన దృష్టికి తీసుకురావాలని ఎమ్మెల్యే సంబంధిత అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణ, రామాలయ మాజీ చైర్మన్ లు సూర్యారావు, హిమగిరి రావు, ఆనందరావు, నాయనేని తులసి రావు, నాయకులు నాగరాజు, విష్ణు, చైతన్య, ప్రభాకర్, సంతోష్, సీఎంసీ అధికారులు, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.