13 April, 2026 | 9:49 PM

ఉపాధిహామీ సిబ్బందికి అవగాహన

13-04-2026 08:15 PM

ములకలపల్లి,(విజయక్రాంతి): గ్రామీణ అభివృద్ధి శాఖ కమిషనర్ ఆదేశాలు మేరకు అన్నపురెడ్డిపల్లి మండల పరిషత్ కార్యాలయంలో ఎమ్పిడిఓ మహాలక్ష్మి ఆధ్వర్యంలో ములకలపల్లి,చంద్రుగొండ, అన్నపురెడ్డిపల్లి మూడుమండలాల ఉపాధి హామీ సిబ్బందికి అవగాహన సమావేశాన్ని నిర్వహించారు. టీ ఏ, ఫీల్డ్ అసిస్టెంట్, మేట్ లకు కలిపి ఉపాధి హమీ పథకంలో కొత్తగా వచ్చిన నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టమ్ ను వివరించారు. పనులలో ఉపాధి కూలీలసంఖ్యను పెంచాలని,వారికి ఎక్కువ కూలీ వచ్చే విధంగా పనులు కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ములకలపల్లి, అన్నపు రెడ్డి పల్లి, చంద్రుగొండ ఈజీఎస్ ఏపిఓలు, ఈసిలు పాల్గొన్నారు.