31 March, 2026 | 3:44 PM

Breaking News

ఉద్యోగాలపై సీఎం చెప్పేవి కాకి లేక్కలే.. బడ్జెట్ పత్రాలు అందుకే చింపాం..!   •   పదవీ విరమణ పొందిన ఏఎస్ఐలకు సన్మానం   •   రోడ్డు ప్రమాదాల నివారణ అందరి బాధ్యత   •   రవీంద్ర భారతి హై స్కూల్‌లో ప్రత్యేక సర్టిఫికెట్‌ల పంపిణీ కార్యక్రమం   •   అమీర్‌పేట నీటి సమస్యలపై తక్షణ స్పందన   •   యుద్ధానికి కాలపరిమితి లేదు — జెరూసలెంలో పేలుళ్లు, ఇస్ఫాహాన్‌పై బంకర్ బస్టర్ బాంబులు!   •   రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ విడుదల చేయాలి   •   గ్రంథాలయానికి పుస్తకాల విరాళం   •   బీజేపీలో చేరిన టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్   •   రూ.47 కోట్లతో పూలే విగ్రహాలు — ఏప్రిల్ 11న రేవంత్ చేతుల మీదుగా ప్రారంభం!   •  

రూ.47 కోట్లతో పూలే విగ్రహాలు — ఏప్రిల్ 11న రేవంత్ చేతుల మీదుగా ప్రారంభం!

31-03-2026 02:23 PM

హైదరాబాద్: ట్యాంక్ బండ్ ఐమాక్స్ థియేటర్ ఎదురుగా లేక్ వ్యూ పార్క్ వద్ద ఏప్రిల్ 11 వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) చేతుల మీదిగా ప్రారంభించుకునే మహాత్మా జ్యోతిబాపూలే,సావిత్రి బాయి పూలే విగ్రహ( Jyotirao Savitribai Phule Statues) నిర్మాణ పురోగతి పనులను మంత్రి కొండా సురేఖతో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ... ప్రగతి భవన్ ను జ్యోతిబాపూలే ప్రజాభవన్ గా మార్చుకున్నామని తెలిపారు.

లేక్ వ్యూ  పార్క్ మార్గాలన్ని పూలే మార్గ్ గా మార్చాలని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్(Khairatabad MLA Danam Nagender) సూచించారని తెలిపారు. పూలే మార్గ్ గా పేరు మార్పుపై సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తామని మంత్రి పొన్నం స్పష్టం చేశారు. రూ. 47 కోట్లతో పులే విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. రెండు రోజుల ముందే విగ్రహ ఏర్పాటు పనులు పూర్తి చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. సభ ప్రాంగణంలో ఎవరికి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్ , ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య, ప్రభుత్వ విప్ లు ఆది శ్రీనివాస్, బిర్ల ఐలయ్య, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కవ్వంపల్లి సత్యనారాయణ, నవీన్ యాదవ్, కాలేరు వెంకటేష్ , ముఠా గోపాల్ , బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ , మాజీ మేయర్ గద్వాల విజయ లక్ష్మీ, కార్పొరేషన్ చైర్మన్ లు, నూతి శ్రీకాంత్ గౌడ్ ,మెట్టు సాయి కుమార్, జెరిపాటి జైపాల్ , బీసీ సంఘాల నేతలు జాజుల శ్రీనివాస్ గౌడ్ ,దాసు ,బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ బాలమయాదేవి, హైదరాబాద్ కలెక్టర్, జీహెచ్ ఎంసీ, హెచ్ఎండీఏ కమిషనర్లు పాల్గొన్నారు.