31 March, 2026 | 3:14 PM

గురుకుల విద్యను సద్వినియోగం చేసుకోవాలి

31-03-2026 01:20 PM

పివిటిజి గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ సుజాత

కుమ్రం భీం ఆసిఫాబాద్, (విజయక్రాంతి): తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న ఉచిత గురుకుల విద్యను జిల్లా విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని స్థానిక పి విటిజి గురుకుల ప్రిన్సిపాల్ సుజాత  ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 2026-27 విద్యా సంవత్సరానికి గాను వివిధ తరగతులలో ఉన్న ఖాళీల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు.

జిల్లా కేంద్రంలోని పి వి టి జి గురుకులంలో  మూడవ తరగతిలో 80, నాల్గవ తరగతిలో 49, ఐదవ తరగతిలో 56, అరవ తరగతిలో 18, తొమ్మిదవ తరగతిలో 13 ఖాళీలు ఉన్నట్లు తెలిపారు. జిల్లాలోని పివిటిజి తెగకు చెందిన విద్యార్థులు మే 30 లోగా దరఖాస్తులు అందజేయాలని సూచించారు.అర్హత కలిగిన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని నాణ్యమైన గురుకుల విద్యను పొందాలన్నారు.