4 July, 2026 | 2:00 AM

రాష్ట్రపతి చేతుల మీదుగా పట్టా అందుకున్న మేకల రాకేష్

04-07-2026 12:00 AM

వీపనగండ్ల జూలై 3: మండల పరిధిలోని గోవర్ధనగిరి గ్రామానికి చెందిన మేకల రాకేష్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం సెంట్రలీనవర్సిటీలో రిటైల్ మేనేజ్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండర్ గ్రాడ్యుయేషన్ లో సెకండ్ ర్యాంకు సాధించడం జరిగింది. అనంతపురం సెంట్రల్ యూనివర్సిటీలో జరిగిన కార్యక్రమంలో భారత దేశ రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము చేతుల మీదుగా మేకల రాకేష్ డిగ్రీ పట్టా అందుకున్నారు. పలువురు గ్రామస్తులు రాకేష్ అభినందించారు.