ఆర్టీసీ బస్ సర్వీసు ప్రారంభం
మూసాపేట్ జూలై 3 : మండల పరిధిలోని పోల్కంపల్లి గ్రామంలో శుక్రవారం పోల్కంపల్లి గ్రామం నుండి మహబూబ్ నగర్ కు ఆర్టీసీ బస్సు సదుపాయం ను దేవరకద్ర ఎమ్మెల్యే జిఎంఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక రెండుసార్లు అధికారం చేపట్టిన బీఆర్‌ఎస్ పార్టీ గ్రామాల అభివృద్ధిని పట్టించుకున్న పాపాన పోలేదన్నారు.
ఎన్నికల్లో ఇచ్చినా మీరకే ఇచ్చిన మాట నిలబెట్టుకొని పోల్కంపల్లి నుండి మహబూబ్ నగర్ కు బస్సు సదుపాయని కల్పించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు శెట్టి చంద్రశేఖర్,బగ్గీ కృష్ణయ్యస్ రామన్ గౌడ్ , వివిధ గ్రామాల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు






