ఇష్టానుసారం.. అపార్ట్‌మెంట్ల నిర్మాణం..
పీరంచెరువు శివారులో సెట్ బ్యాక్ వదలకుండా కాంపౌండ్ వాల్ నిర్మిస్తున్న మేఘన కన్‌స్ట్రక్షన్ యజమాని
రాజేంద్రనగర్, జూలై 3 (విజయక్రాంతి) ః జిహెచ్‌ఎంసి రాజేంద్రనగర్ సర్కిల్ 123 డివిజన్ పరిధిలో అక్రమ నిర్మాణాలు జోరుగా కొనసాగుతున్నాయి. ఇందులో వెలుగు చూసినవి కొన్ని మాత్రమే అయిన వెలుగులోకి రానివి మరెన్నో..! పీరంచెరువు లోని హనుమాన్ టెంపుల్ దగ్గర ‘మేఘన కన్స్ట్రక్షన్ ‘ బారి అపార్ట్మెంట్ ను నిర్మిస్తుంది పిరం చెరువు విలేజ్ లోకి వెళ్ళే ప్రధాన రహదారి 40 వెడల్పు ఉన్నది ఈ అపార్ట్మెంట్ ముందు బిల్డర్ ఎలాంటి సెట్ బ్యాక్ వదలకుండా పిల్లర్ వేసి కాంపౌండ్ వాల్ నిర్మిస్తున్నాడు.
ఈ కాంపౌండ్ వాల్ నిర్మాణంతో కాలనీ ప్రజలు భవిష్యత్తులో ఇబ్బందులకు గురి కాక తప్పదు కనీస నిబంధనలు పాటించకుండా బిల్డింగ్ నిర్మాణాన్ని కొనసాగిస్తున్న రాజేంద్రనగర్ సర్కిల్ అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడడం లేదు..
మేఘన కన్స్ట్రక్షన్‌పై చర్యలు తీసుకోవాలి..
తీరం చెరువు ప్రధాన రహదారిపై ఎలాంటి సెట్ బ్యాక్ లేకుండా కాంపౌండ్ వాల్ నిర్మిస్తున్న మేఘన కన్స్ట్రక్షన్ యజమానిపై రాజేంద్రనగర్ సర్కిల్ అధికారులు చర్యలు తీసుకోవాలి. అలాగే సెట్ బ్యాక్ వదిలి కాంపౌండ్ వాల్ నిర్మించే విధంగా రాజేంద్రనగర్ డి సి సురేందర్ రెడ్డి సిబ్బందికి ఆదేశాలు ఇవ్వాలి. లేనిపక్షంలో బిజెపి ఆధ్వర్యంలో డిప్యూటీ కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడిస్తాం..
కొండె మహేష్ యాదవ్, బండ్లగూడ జాగిర్ బీజేపీ అధ్యక్షుడు






