పోలీస్ కమిషనర్ కు తప్పని వేధింపులు
దిల్ సుఖ్ నగర్ బస్టాండ్ వద్ద అర్ధరాత్రి
మల్కాజిగిరి సీసీ సుమతి ఆపరేషన్
వేధింపులకు గురి చేసిన 40 మంది పోకిరీల అరెస్టు
కనిపించని మొబైల్ పెట్రోలింగ్ పోలీసులు
అర్ధరాత్రి మహిళా పోలీస్ కమిషనర్ సంచలన ఆపరేషన్
ఎల్బీనగర్: రాత్రి సమయంలో సామాన్య మహిళలలకే కాకుండా పోలీసు ఉన్నతాధికారికి సైతం ఈవ్ టీజర్ల నుంచి వేధింపులు తప్పలేదు. రాత్రి సమయంలో సుమారు 40 మంది పోకిరీలు పోలీస్ కమిషనర్ ను అసభ్యంగా ప్రవర్తించి, వేధింపులకు గురి చేశారు. రాత్రి సమయంలో ఆడవారి భద్రతపై పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా మల్కాజిగిరి పోలీస్ కమిషనర్(Malkajgiri Police Commissioner) గా బాధ్యతలు చేపట్టిన తొలిసారిగా దిల్ సుఖ్ నగర్ లో అర్ధరాత్రి నుంచి తెల్లవారుజామున వరకు సిక్రెట్ ఆపరేషన్ చేపట్టారు.
అరాచకాలకు నిలయంగా పేరున్న దిల్ సుఖ్ నగర్ బస్టాండ్(Dilsukhnagar Bus Stand)కు అర్ధరాత్రి ఒంటరిగా ఎలాంటి సెక్యూరిటీ లేకుండా మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ సుమతి వచ్చారు. ఈ మేరకు మూడు రోజుల పాటు దిల్ సుఖ్ నగర్ బస్టాండ్ వైపు సీపీ సుమతి స్వయంగా నిఘా పెట్టారు. ఇందులో భాగంగా మహిళా కమిషనర్ గా కాకుండా, సగటు మహిళగా బస్టాండ్ లో బస్ కోసం నిల్చున్నారు. కమిషనర్ అని తెలియక, సగటు మహిళకు ఎదురయ్యే వేధింపులను సీపీ ప్రత్యక్షంగా చూశారు. ఒంటిరిగా ఉన్న సీపీ సుమతిని సుమారు 40 మంది పోకిరీలు చుట్టుముట్టారు.
సుమతిని చుట్టుముట్టిన పోకిరీల్లో ఎక్కువ మంది విద్యార్థులే ఉన్నారు. వీరందరూ మద్యం, గంజాయి మత్తులో ఉన్నారు. అయితే, రహదారిపై నిఘా పెట్టాల్సిన మొబైల్ పెట్రోలింగ్ పోలీసులు అటు వైపు కన్నెత్తి చూడలేదు. చివరికి 3:30 గంటలకు బీట్ కానిస్టేబుల్ వచ్చి పరిస్థితిని గుర్తించాడు. 40 మంది పోకిరీలను పోలీసులు అదుపులోకి తీసుకుని కౌన్సిలింగ్ నిర్వహించారు. చదువుకోవాల్సిన యువకులు రాత్రి వేళల్లో పోకిరి చేష్టలు చేస్తుండడం ఆందోళనకు గురి చేస్తున్నది. దిల్ సుఖ్ నగర్ ప్రాంతంలో ఎక్కువగా హాస్టల్స్ ఉండడంతో యువకులు ఈవ్ టీజింగ్ కు పాల్పడుతున్నారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని.






