6 May, 2026 | 2:03 PM

శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్న రాజ్యసభ ఎంపీ వేం నరేంధర్ రెడ్డి

06-05-2026 01:26 PM

యాదగిరిగుట్ట, (విజయక్రాంతి): ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి(Sri Lakshmi Narasimha Swamy) వారిని రాజ్యసభ ఎంపీ వేం నరేందర్ రెడ్డి(Rajya Sabha MP Vem Narender Reddy) కుటుంబ సభ్యులతో కలసి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య  నరేంధర్ రెడ్డికి ఘనంగా స్వాగతం పలికారు. స్వామి వారి  ఆలయంలో  ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఆలయ అర్చకులు వేద మంత్రాల నడుమ ఆయనకు సంప్రదాయాల ప్రకారం స్వాగతం పలికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈవో భవాని శంకర్ స్వామి వారి చిత్రపటాన్ని అందజేశారు. అనంతరం ఆలయ విశేషాలు, అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులు వివరాలు తెలియజేశారు. ఈ సందర్భంగా వేం నరేందర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు శాంతి, సుభిక్షాలతో జీవించాలని కోరుకున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, భక్తులు పాల్గొన్నారు.