10-02-2026 12:37:10 AM
తెలంగాణ రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
ముకరంపుర, ఫిబ్రవరి9(విజయక్రాంతి):కేంద్ర మంత్రి బండి సంజయ్కుమార్ కాంగ్రెస్పు తప్పుడు ఆరోపణలు చేయడం సరి కాదని తెలంగాణ రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఖండించారు. సోమవారం కరీంనగర్ డీసీసీ కార్యాలయం ఇందిరా భవన్ లో ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి , సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, లైబ్రరీ చైర్మన్ సత్తు మల్లేష్, మాజీ ఎమ్మెల్యేలు ఆరేపల్లి మోహన్, కోడూరి సత్యనారాయణ, పడాల రాహుల్, ఆర్టీఏ మెంబర్, అర్బన్ బ్యాంక్ చైర్మన్ కర్ర రాజశేఖర్ , అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి ఇతర ముఖ్య నేతలతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ తో పాటు ఉమ్మడి జిల్లాలోని అన్ని మున్సిపాలిటీ లలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలన్నారు. ప్రజా పాలన ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆశీర్వదించాలన్నారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ నుండి దివంగత నేత సత్యనారాయణ రావు దీనిని కార్పొరేషన్ గా చేశారన్నారు.. అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటున్నామన్నారు.
కరీంనగర్ లో ఏ అభివృద్ధి జరిగిన అది కాంగ్రెస్ ప్రభుత్వ హయంలోనే జరిగిందన్నారు. ఇటీవల బీఆర్‌ఎస్ 10 సంవత్సరాలుగా అధికారంలో ఉన్న మానేరు రివర్ ఫ్రం ట్ ,కుంగిపోయిన తీగల వంతెన ,స్మార్ట్ సిటీ మెయిన్ రోడ్డులకే పరిమితం అవడం..కేంద్ర నిధు లు అయిన అవినీతి జరిగింది అని చెప్పిన చర్యలు తీసుకోవడం లో కేంద్ర మంత్రి విఫలమయ్యారన్నారు. అవినీతిమయం అయిందన్న మేయర్ నే పార్టీలో చేర్చుకున్నారన్నారు.
కరీంనగర్ నియోవర్గం శాసన సభ్యుడి గా ఉన్న నాడు మంత్రి గా ఉండి కూడా ఒక్కరికి కూడా డబుల్ బెడ్ రూం ఇవ్వలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇళ్లు చొప్పున ఇస్తూ పేద ప్రజలకు గూడు కల్పించిందన్నారు. అభివృద్ధి సంక్షేమం రెండు జోడెద్ధుల్లా పని చేస్తామన్నారు. మేం ఎంఐఎం తో కుమ్మక్కయ్యమని మాట్లాడుతున్నారన్నారు.
అర్థరహితమైన ఆరోపణలు మంచిది కాదన్నారు. కాంగ్రెస్ 66 స్థానాల్లో పోటీ చేస్తుందన్నారు. బీఆర్ ఎస్, బీజేపీ లోపాయికారి ఒప్పందం చేసుకున్నారన్నారు.. అభ్యర్థుల ఎంపిక లో మీరు అలయ్ బలాయీ తీసుకొని ఒప్పందం కుదుర్చుకున్నారన్నారు.