22 April, 2026 | 3:49 PM

Breaking News

ఖర్గే వ్యాఖ్యలపై ఆగ్రహం.. తంగళ్ళపల్లిలో బీజేపీ దిష్టిబొమ్మ దహనం   •   సారంపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం   •   కేసీఆర్, రేవంత్ కాంప్రమైజ్ పాలిటిక్స్   •   రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న ఆర్టీసీ కార్మికుల సమ్మె న్యాయబద్ధమైనది   •   ఆర్టీసీ ఉద్యోగుల సమ్మెకు బీఆర్ఎస్ నేతల మద్దతు   •   చెరువులో పడి వ్యక్తి మృతి   •   ప్రైవేట్ హాస్పిటల్‌లో వైద్యుల నిర్వాకం.!   •   కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ ఒకటే... హైకోర్టు తీర్పుపై కిషన్ రెడ్డి స్పందన   •   చిత్రపరిశ్రమలో తీవ్ర విషాదం.. సంతాపం తెలిపిన కేంద్రమంత్రి   •   కాళేశ్వరంపై కేంద్రం సీబీఐ విచారణ చేయించాలి.. కాంగ్రెస్ ఎంపీ చామల డిమాండ్   •  

మక్కల కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలి

10-02-2026 12:38 AM

 తాడ్వాయి, ఫిబ్రవరి, 9( విజయ క్రాంతి ): తాడ్వాయి మండల కేంద్రంలో మక్కల కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని భారతీయ కిసాన్ సంఘ్ నాయకులు డిమాండ్ చేశారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలో సోమవారం భారతీయ కిసాన్ సంఘ నాయకులు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైతులకు మక్కలు కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి మద్దతు ధరను అందించాలని కోరారు.

రైతులు పండించిన సన్న రకం వరి ధాన్యానికి ప్రభుత్వం అందించే బోనస్ రూపాయలు వెంటనే రైతుల ఖాతాల లో జమ చేయాలన్నారు. గతం లో కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న రోడ్లను ప్రభుత్వం వెంటనే బాగు చేయాలని కోరారు.అనంతరం తహసీల్ధార్ కు వినతి పత్రం అందించారు.ఈ కార్యక్రమంలో భారతీయ కిసాన్ సంఘ్ జిల్లా అధ్యక్షులు పైడి విట్టల్ రెడ్డి, మండల అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.