calender_icon.png 10 February, 2026 | 7:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కల్యాణలక్ష్మిచెక్కుల పంపిణీ

10-02-2026 12:37:07 AM

నిజాంసాగర్, ఫిబ్రవరి 9 (విజయక్రాంతి): నిజాంసాగర్ మండల పరిధిలోని అన్ని గ్రామ పంచాయతీలకు సంబంధించిన  కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను సోమవారం నాడు నిజాంసాగర్ మండల పరిషత్ కార్యాలయంలో కామారెడ్డి జిల్లా డిసిసి అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో  పిట్లం మార్కెట్ కమిటీ చైర్మన్ చీకోటి మనోజ్ కుమార్, అచ్చంపేట సర్పంచ్ సంకుల లక్ష్మయ్య, బొజ్జ అంజయ్య, నాయకులు ప్రజా పండరి, అనీస్, మెంగారం శ్రీనివాస్,చాకలి సాయిలు అన్ని గ్రామాల సర్పంచులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.