21 July, 2026 | 5:18 AM

కేటీఆర్ పర్యటనను విజయవంతం చేయండి

20-07-2026 12:52 PM

కోటపల్లి, (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లాలో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ నెల 21న నిర్వహించే పర్యటనను విజయవంతం చేయాలని కోటపల్లి  మండల సోషల్ మీడియా ఇంచార్జి బాపు నాయక్ సోమ వారం కోరారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని లక్షెట్టిపేట మండలంలో ఇటీవల షెడ్డు కూలి మృతిచెందిన రైతు కుటుంబాలను పరామర్శించేందుకు వస్తున్నారన్నారు. బాధిత కుటుంబాలకు సానుభూతిని తెలియజేసీ రైతుల సమస్యలను తెలుసుకుంటారన్నారు. ఈ పర్యటనను బీ ఆర్ ఎస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు.