రైతులను ఆదుకోవాలి
- కన్నెపల్లి నుంచి నీటిని ఎత్తిపోయండి
- కాపర్ డాం నిర్మాణం చేపట్టాలి
- మాజీ మంత్రి జీవన్‌రెడ్డి
- జగిత్యాల జిల్లా మల్యాలలో సాగునీటి కోసం రైతుల రాస్తారోకో
- వెళ్లకుండా జీవన్‌రెడ్డిని అరెస్టు చేసిన పోలీసులు
మల్యాల, జూలై 20 (విజయక్రాంతి): కన్నెపల్లి పంపుహౌస్ నుంచి నీటిని ఎత్తిపోసి, సాగు నీరు అందించి రైతులను ఆదుకోవాలని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జగిత్యాల జిల్లా మల్యాల ఎక్స్‌రోడ్డు వద్ద సాగునీటి కోసం సోమవారం రైతులు రాస్తారోకో చేపట్టారు. రైతులకు సంఘీభావం తెలిపేందు కు జగిత్యాల నుంచి వెళ్తున్న జీవన్‌రెడ్డిని పోలీసులు నూకపల్లి వద్ద అడ్డుకున్నారు.
పోలీసుల తీరును నిరసిస్తూ ఆయన రోడ్డుపైనే బైఠాయించి నిరసనకు దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొనడంతో పోలీసులు జీవన్ రెడ్డిని బలవంతంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. రైతులకు మద్దతుగా బయ లుదేరిన చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్‌ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.వీ రితో పాటు రైతు నాయకులను అరెస్ట్ చేశారు.
ఈ సందర్భంగా జగిత్యాల పట్టణంలోని జీవన్‌రెడ్డి స్వగృహంలో మీడి యా సమావేశంలో జీవన్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘రైతు బిడ్డగా, రైతుల ధర్నాకు సంఘీభావం తెలిపే హక్కు మాకు లేదా. సంఘీభావం తెలిపేందుకు వెళ్తున్న మామల్ని పోలీసులను అడ్డుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితంలో పోలీసులను ఇంత అప్రజాస్వామ్య పద్ధతి ఏనాడూ చూడలేదు’ అని జీవన్‌రెడ్డి మండిపడ్డారు.
‘కేసీఆర్ పాలనలో 24 గంటలు విద్యుత్ సరఫరా అయిందని, ప్రాజెక్ట్‌లో నీటి వినియోగించుకోలేకపోవటమే విద్యుత్ కోతలకు ప్రధాన కారణమని చెప్పారు. రేవంత్‌రెడ్డి పాలనలో విద్యుత్ ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి నెలకొన్నదన్నారు. నీటిని ఎత్తిపోస్తే కేసీఆర్‌కు పేరు వస్తుందనే ఉద్దేశంతోనే కన్నెపల్లి పంప్‌హౌస్ నుంచి నీటిని ఎత్తిపోయడం లేదన్నారు.
ఇప్పటికే లక్షలాది క్యూసెక్కుల నీరు వృథాగా పోయిందని, కాఫర్ డ్యాం నిర్మాణం చేపడితే, మేడిగడ్డకు సంబంధం లేకుండా నీటిని ఎత్తిపోయవచ్చునని చెప్పారు. ఎస్సారెస్పీ, మిడ్ మేనేర్, ఎల్‌ఎండీ వట్టిపోయాయని, చొప్పదండి నియోజకవర్గంలోని మండలాలకు సాగునీరు అందించాలని మాజీ ఎమ్మెల్యే రవిశంకర్ కృషి చేస్తే ఆయనను పోలీసులు అడ్డుకోవడం అన్యాయమని జీవన్‌రెడ్డి వ్యాఖ్యానించారు.






