21 July, 2026 | 5:19 AM

దమ్మపేట నూతన తాహశీల్దార్గా మద్దినేని మురళి

20-07-2026 12:50 PM

దమ్మపేట, జులై 20(విజయక్రాంతి): దమ్మపేట నూతన తాహశీల్దార్గా మద్దినేని మురళి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో పనిచేసిన కె. రామ్ నరేష్ పలు అవినీతి ఆరోపణలపై సస్పెండ్ కావడంతో ఆయన స్థానంలో అండర్ ట్రైనింగ్ డిప్యూటీ కలెక్టర్ గా వున్న మద్దినేని మురళిని దమ్మపేట తాహశీల్దార్ గా డిప్యుటేషన్పై, నియమించారు. ఈ సందర్భంగా కార్యాలయ సిబ్బంది నూతన తాహశీల్దార్ మద్దినేని మురళికి స్వాగతం పలికి పుష్పగుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు.