21 July, 2026 | 6:33 AM

ఓటరు జాబితా సవరణకు కాంగ్రెస్ కసరత్తు

20-07-2026 02:10 PM

మండల ఇన్‌చార్జ్‌లకు బాధ్యతలు అప్పగింత

భూపాలపల్లి, జూలై 20 (విజయక్రాంతి): జిల్లాలో జరుగుతున్న ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని పకడ్బందీగా, వేగవంతంగా పూర్తి చేయాలనే లక్ష్యంతో జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కార్యవర్గ సభ్యులకు మండల ఇన్‌చార్జ్‌లుగా బాధ్యతలు అప్పగించారు.

ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు బట్టు కరుణాకర్   మాట్లాడుతూ, ప్రతి మండల ఇన్‌చార్జ్ తమకు కేటాయించిన మండలంలో బూత్ స్థాయి వరకు సమన్వయం చేస్తూ, బూత్ స్థాయి ప్రతినిధులతో నిరంతరం సంప్రదింపులు జరపాలని సూచించారు. ప్రతి రోజు జరుగుతున్న పనులపై సమీక్ష నిర్వహించి, ఎదురయ్యే సమస్యలను వెంటనే జిల్లా కమిటీ దృష్టికి తీసుకురావాలని తెలిపారు.