ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సంకల్పంతోనే బస్తీ దవాఖానలు
ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణ రావు
సుల్తానాబాద్ , జూలై 20 (విజయ క్రాంతి): రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంకల్పంతోనే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు గాను పల్లె దవఖానలు, బస్తీ దవాఖాన లు ఏర్పాటు చేస్తుందని ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అన్నారు, సోమవారం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలోని ఏడవ వార్డులో 20 లక్షల రూపాయలతో నూతన బస్తీ దవాఖాన నిర్మాణం కోసం స్థానిక నాయకులతో కలిసి విజయ రమణారావు శంకుస్థాపన చేశారు,
ముందుగా ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే విజయరమణ రావు ని స్థానిక వార్డు కౌన్సిలర్ ఉట్ల పర ప్రదీప్ ప్రజాప్రతినిధులు ఘనంగా సన్మానించారు.. ఈ సందర్బంగా విజయరమణ రావు మాట్లాడుతూ...ప్రజలందరికీ వైద్య సేవలు అందించాలనే గొప్ప సంకల్పంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పల్లె దవఖానలు, బస్తీ దవాఖానలకు ప్రభుత్వ వైద్యశాలలో మెరుగైన చికిత్సలు అందిస్తూ ముందుకు పోతున్నారని అందులో భాగంగానే ఏడవ వార్డులో 20 లక్షల రూపాయలతో బస్తీ దవాఖాన నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్, మున్సిపల్ చైర్మన్ బిరుదు రాధాకృష్ణ, మార్కెట్ కమిటీ చైర్మన్ మినుపాల ప్రకాష్ రావు, సింగిల్ విండో చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్, మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ అంతటి పుష్పలత మరియు స్థానిక కౌన్సిలర్ ఊట్ల వరప్రదీప్ , ధనాయక్ దామోదర్ రావు , మున్సిపల్ కౌన్సిలర్లు, వైద్యులు,కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు వార్డు ప్రజలు పలువురు పాల్గొన్నారు.






