యాక్షన్ రౌడీ జనార్దన
స్టార్ హీరో విజయ్ దేవరకొండ ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌లో నటిస్తున్న క్రేజీ సినిమా ‘రౌడీ జనార్దన’. స్టార్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. యంగ్ డైరెక్టర్ రవికిరణ్ కోలా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. రూరల్ యాక్షన్ డ్రామా నేపథ్యంతో రూపుదిద్దుకుంటోందీ సినిమా. సోమవారం ఈ మూవీ టీమ్ సినిమా సెట్స్ నుంచి కొన్ని వర్కింగ్ స్టిల్స్ రిలీజ్ చేశారు.
డైరెక్టర్ రవికిరణ్ కోలా పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ఈ లేటెస్ట్ వర్కింగ్ స్టిల్స్ చూస్తే.. దర్శకుడు రవికిరణ్ కోలా ఈ సినిమాను ఎంత ప్యాషనేట్‌గా, కాన్ఫిడెంట్‌గా తెరకెక్కిస్తున్నారో అర్థమవుతోంది. కీర్తి సురేశ్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి డీవోపీగా ఆనంద్ సీ చంద్రన్, ప్రొడక్షన్ డిజైనర్‌గా డినో శంకర్ పనిచేస్తున్నారు. డిసెంబర్‌లో థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమవుతోందీ సినిమా.






