స్పెయిన్‌కే సాకర్ కిరీటం
- టికీ-టాకా 2.0 వ్యూహంతో విజయం
- మెస్సీకి ఛాన్స్ ఇవ్వని స్పానిష్ డిఫెండర్లు
- 16 ఏళ్ల తర్వాత వరల్డ్‌కప్ కైవసం
- కన్నీటి పర్యంతమైన అర్జెంటీనా దిగ్గజ క్రీడాకారుడు మెస్సీ
పదహారేళ్ల్ల నిరీక్షణ... తొలి మ్యాచ్‌లో ఊహించని డ్రా.. తర్వాత వరుస విజయాలతో ఫైనల్లోకి ఎంట్రీ.. తీరా ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్‌తో టైటిల్ సమరం... కానీ తుది మెట్టుపై స్పెయిన్ ఎక్కడా వెనక్కి తగ్గలేదు.. ఒకప్పుడు ఏ వ్యూహంతో వరుస పరాజయాలు చవిచూసి విమర్శలు ఎదుర్కొందో ఇప్పుడు అదే వ్యూహాన్ని 2.0గా మెరుగుపరుచుకుని ప్రత్యర్థికి చుక్కలు చూపించింది.
తమ బలం డిఫెన్స్‌తోనే అర్జెంటీనాకు చెక్ పెట్టింది. ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టి అదును చూపి పంజా విసరడంలో తమకు తామే సాటి అని మరోసారి నిరూపించుకున్న స్పెయిన్ సుధీర్ఘ నిరీక్షణ తర్వాత విశ్వ విజేతగా నిలిచింది. ఫైనల్లో మెస్సీని అడ్డుకోవడంలో స్పానిష్ డిఫెండర్లు పూర్తిగా విజయవంతమయ్యారు. దీంతో వరుసగా రెండోసారి ప్రపంచకప్ గెలవాలనుకున్న ఆశలు నెరవేరకపోవడంతో అర్జెంటీనా దిగ్గజం కన్నీటి పర్యంతమయ్యాడు.






