17 July, 2026 | 3:09 AM

పోయిన లగేజ్ బ్యాగ్ 48 గంటల్లో గుర్తింపు

17-07-2026 12:00 AM
  1. అప్పగించిన ఆర్జీఐ ఎయిర్‌పోర్ట్ పోలీసులు
  2. పోలీసులను ప్రశంసించిన పులిగారి గోవర్ధన్ రెడ్డి

ముషీరాబాద్, జూలై 16 (విజయక్రాంతి): రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఆర్జీఐ) అవుట్పోస్ట్ పోలీసులు కేవలం 48 గంటల్లో పోయిన లగేజ్ బ్యాగ్ను గుర్తించి బాధితుడికి అప్పగించడంతో వారి సేవలను మాజీ ప్రజా ప్రతినిధి ప్రశంసించారు. అమెరికా నుంచి జూలై 14న ఉదయం హైదరాబాద్కు చేరుకున్న పులిగారి గోవర్ధన్ రెడ్డి లగేజ్ ట్రాలీ నుంచి సుమారు రూ.1 లక్ష విలువైన ల్యాప్టాప్తో పాటు ఇతర వస్తువులు ఉన్న బ్యాగ్ను మరో ప్రయాణికుడు పొరపాటున తీసుకెళ్లాడు.

విషయం గుర్తించిన వెంటనే ఎయిర్పోర్టు అధికారులకు, ఆర్జీఐ ఎయిర్పోర్ట్ అవుట్పోస్ట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు సీసీటీవీ దృశ్యాలను పరిశీలించి, నిజామాబాద్కు చెందిన ప్రయాణికుడి వద్ద ఉన్న బ్యాగ్ను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అనంతరం జూలై 16న బాధితుడికి బ్యాగ్ను అప్పగించారు.

ఈ సందర్భంగా తెలంగాణ గ్రామ పంచాయతీ ట్రిబ్యునల్ మాజీ సభ్యుడు పులిగారి గోవర్ధన్ రెడ్డి స్పందిస్తూ కేవలం 48 గంటల్లో కేసును ఛేదించి బ్యాగ్ను రికవరీ చేసిన పోలీసు అధికారి జగన్తో పాటు సిబ్బందిని అభినందించారు. ఇలాంటి వేగవంతమైన చర్యలతో దేశ, విదేశాల నుంచి వచ్చే ప్రయాణికుల్లో తెలంగాణ పోలీసులపై మరింత నమ్మకం పెరుగుతుందని పేర్కొన్నారు. ’తెలంగాణ ఫ్రెండ్లీ పోలీస్కు హ్యాట్సాఫ్’ అంటూ ఆయన ప్రశంసలు తెలిపారు.