20 April, 2026 | 2:57 AM

సర్వజ్ఞలో లిటిల్ స్టార్స్ గ్రాడ్యుయేషన్ డే

20-04-2026 01:02 AM

లక్ష్యాలను నిర్దేశించుకొని పనిచేయడం సంతోషకరం

చైర్మన్ ఆర్‌వీ నాగేంద్రకుమార్

ఖమ్మం, ఏప్రిల్ 19 (విజయక్రాంతి): విద్యార్థులను స్వయం ప్రతిపత్తితో ఎదిగేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని, చదువుతో పాటు నైతిక విలువలు పెంపొందించుకోవాలని ‘సర్వజ్ఞ’ విద్యారంగంలో లక్ష్యాలను నిర్దేశించుకొని పనిచేయడం సంతోషకరమని సర్వజ్ఞ విద్యా సంస్థల చైర్మన్ ఆర్.వి. నాగేంద్రకుమార్ అన్నారు.

ఖమ్మం పట్టణం వీడీవోస్ కాలనీ సర్వజ్ఞ పాఠశాలలో ‘లిటిల్ స్టార్స్’ గ్రాడ్యుయేషన్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఖమ్మం జిల్లా న్యాయసేవా అధికార సంస్థ ప్రతినిధి పీ సంధ్య ము ఖ్య అతిథిగా విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సంధ్య మాట్లాడుతూ.. అమెరికా, భా రత్ విద్యా విధానాల మధ్య తేడాలను వివరించారు. ఈ స్థాయినుంచే పిల్లలకు బేసిక్ విద్య అనేది విలువలను, భవిష్యత్‌ను తీర్చిదిద్దేదన్నారు.

సర్వజ్ఞ విద్యాసంస్థల్లో అనుభవం కలిగిన అధ్యాపకులతో మొదలై ప్రస్తు తం కాలేజీ స్థాయివరకు ఎదగడం గర్వకారణమన్నారు. చైర్మన్ నాగేంద్రకుమార్ మా ట్లాడుతూ.. విద్యే అతిపెద్ద ఆస్తి అని, చిన్నవయస్సు నుంచే సరైన విద్యను అందించడం ద్వారా విద్యార్థులు ఉన్నత శిఖరాలను చేరుకుంటారని వివరించారు.

విద్యార్థుల సమ గ్రాభివృద్ధికి సర్వజ్ఞ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని హామీ ఇచ్చారు. డైరెక్టర్ ఆర్‌వీ నీలి మ మాట్లాడుతూ.. విద్యార్థుల ఎదుగుదల సంతోషాన్ని ఇస్తుందని, వారి భవిష్యత్ ఉజ్వలంగా ఉండాలని ఆకాంక్షించారు. గ్రాడ్యుయే షన్ డే సందర్భంగా ప్రీ-ప్రైమరీ విద్యార్థులకు ముఖ్య అతిథుల చేతుల మీదుగా గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్లు అందజేశారు. విద్యార్థులు చేపట్టిన ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. వేడుకలను విజయవంతం చేసిన వారందరికీ ‘సర్వజ్ఞస్కూల్ యాజమాన్యం’ చైర్మన్ నాగేంద్రకుమార్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.