4 August, 2026 | 1:30 AM

నత్తకే నవ్వొచ్చేలా.. లెవెల్ బిడ్జీ పనులు!

04-08-2026 12:00 AM
  1. ఏండ్లు గడుస్తున్న పూర్తికాని హై లెవెల్ బ్రిడ్జీ..
  2. ప్రారంభమై..మూడేళ్లు..పిల్లర్ల కే పరిమితం.
  3. మట్టిరోడ్డు ఉండేనా.. ఊడేనా..
  4. గతేడాది మట్టి రోడ్డు కొట్టుకుపోయి రెండు నెలలు రాకపోకలు బంద్..

గంభీరావుపేట ఆగస్టు 3(విజయక్రాంతి )మానేరు వాగుపై హైలెవెల్ బ్రిడ్జి నిర్మాణానికి నిధులు మంజూరై దాదాపు మూడేళ్లు కావొస్తున్న నిర్మాణ పనులు మాత్రం నత్తకే నవ్వొచ్చేలా సాగుతున్నాయి.వంతెన నిర్మాణం పూర్తి అయ్యే వరకు తాత్కాలికంగా వేసిన మట్టి రోడ్డు మాత్రం ప్రతి ఏటా వర్షాకాలంలో వరద ప్రవాహానికి కొట్టుకుపోయి నెలల తరబడి ప్రయాణికులు,రైతులు, ప్రజలు అనేక అవస్థలు పడుతున్నారు.

బ్రిడ్జి నిర్మాణానికి రూ. 10.60కోట్లు మంజూరైనా..

మానేరు వాగుపై హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణానికి రూ. 10.60 కోట్లు మంజూరైనా నిర్మాణ పనులు నత్త నడక నడుస్తున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండ ల కేంద్రం లింగన్నపేట గ్రామాల మధ్య మానేరు నది ప్రవహిస్తూ ఉంటుంది.ఈ నది పై 30ఏళ్ల క్రితం నిర్మించిన లో లెవెల్ వంతెన ఉండేది. ప్రతి ఏటా వర్షాకాలంలో ఎగువ మానేరు ప్రాజెక్టు నిండి మత్తడి దుకాడంతో సిద్దిపేట- కామారెడ్డి- దుబ్బాక రాకపో కలు నెలల తరబడి నిలిచిపోయేవి.

గత ప్రభుత్వంలో మాజీ మంత్రి ప్రస్తుత సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ రూ. 10.60కోట్లు హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణానికి నిధులు మంజూరు చేసి, 2023 సంవత్సరం సెప్టెంబర్ లో బ్రిడ్జి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. లో లెవెల్ వంతెనను తొలగించి అదే స్థానంలో హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణానికి పిల్లర్లు వేశారు. పక్కనే రాకపోకలకు అంతరాయం కాకుండా పైప్ లైన్లు వేసి మట్టి రోడ్డు ఏర్పాటు చేశారు. మూడేళ్లయిన బ్రిడ్జి పనులు పూర్తి కాకపోవడంతో ప్రతి ఏటా వర్షాకాలంలో మానేరు మత్తడి దూకి మట్టి రోడ్డు కొట్టుకుపోవడం పరిపాటిగా మారింది.

దీంతో నెలల తరబడి రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. గతేడాది మట్టి రోడ్డు కొట్టుకుపోవడంతో దాదాపు రెండు నెలలు రాకపోకలు బందయ్యాయి. కామారెడ్డి, సిద్దిపేట, దుబ్బాక ప్రధాన రహదారి కావడంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. బ్రిడ్జి నిర్మాణ పనులు ఇంకా పిల్లర్ల దశలోనే ఉండడంతో స్థానిక ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్థానిక ప్రజా ప్రతినిధులు స్పందించి వెంటనే హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణ పనులు తొందరగా పూర్తి అయ్యేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతోనే జాప్యం..

కాంట్రాక్టర్ నిర్లక్ష్యం తోనే హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణ పనుల్లో జాప్యం జరుగుతోంది. గత ఆరు నెలల నుండి బ్రిడ్జి ని ర్మాణ పనులు వేగం పెంచాలని ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేశాం. బ్రిడ్జి పనులు పూర్తి కాకపోవడంతో ప్రతి ఏటా వర్షాకాలంలో మట్టి రోడ్డు కొట్టుకుపోయి ప్ర జల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా రు. ఉన్నతాధికారులు స్పందించి, బ్రిడ్జి నిర్మాణ పనులపై పర్యవేక్షించి, హై లెవె ల్ బిజినెస్ నిర్మాణ పనులు తొందరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలి.

మల్లు గారి పద్మ, సర్పంచ్ గంభీరావుపేట.

అధికారులు నిర్లక్ష్యం వీడాలి

అధికారులు నిర్లక్ష్యం వీడి, బ్రిడ్జి నిర్మాణ పనులలో వేగం పెంచే విధంగా చర్యలు తీసుకోవాలి.మట్టి రోడ్డు కొట్టుకుపోతే..మండల కేంద్రంలో ప్రభుత్వ కార్యాలయాలతో పాటు వివిధ పనుల నిమిత్తం మండల కేంద్రానికి వచ్చే మాకు నెలల తరబడి రాకపోకలు లేకుంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ఏళ్లుగా బ్రిడ్జి నిర్మాణ పనులు చేస్తూనే ఉన్నారు. బ్రిడ్జి నిర్మాణ పనుల్లో నిర్లక్ష్యం విడి పనుల్లో వేగం పెంచి తొందరగా పూర్తి చేసి వినియోగం లోకి తీసుకురావాలి.

పిట్ల ఎల్లయ్య సర్పంచ్, లింగన్నపేట