హైడ్రా భాగ్యం.. నగరానికే పరిమితమా!
- జిల్లాల్లోని చెరువులు, కుంటలు, నాలాలు, ప్రభుత్వ భూముల్లో పెరుగుతున్న కబ్జాలు
- సెట్బ్యాక్, పార్కింగ్ లేకుండానే భారీ కమర్శియల్ నిర్మాణాలు
- చిన్న పాటి వర్షాలకే మునుగుతున్న కాలనీలు రోడ్లు
- ఆక్రమణల తొలగింపుపై రాజకీయం
- కేసరి సముద్రం సహా పలు ప్రాంతాల్లో పెరుగుతున్న ఆక్రమణలు
నాగర్ కర్నూల్, ఆగస్టు 3 (విజయక్రాంతి): చెరువులు కుంటలు నాళాలు భావి తరాలకు కల్పతరువుగా మారతాయని వాటి ని రక్షించుకోవడం వల్లే మానవ మనుగడ సాధ్యపడుతుందని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం భాగ్యనగరం హైదరాబాద్ లొ హైడ్రా పేరుతో ప్రత్యేక వ్యవస్థను రూపొందించింది. చెరువులు పునరుద్ధరించడంతో పాటు చిన్నపాటి వర్షాలకు రోడ్లు నాళాలు ముంపునకు గురికాకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంది. ప్రస్తుతం కోర్టులను సైతం పట్టించుకోకుండా ప్రజా అవసరాలే లక్ష్యంగా పనిచేస్తున్న హైడ్రా వ్యవస్థకు ప్రజల నుంచి ప్రశంసలు అందుకోగా రాష్ట్ర ప్రభుత్వం కూడా హైడ్రా గొ ప్పదంటూ కీర్తిస్తోంది.
మరి జిల్లాల్లోని చెరువులు కుంటలు, నాళాలు పరిరక్షణ విషయంలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని నాగర్ కర్నూల్ జిల్లాలోని ఆయా నియోజకవర్గ ప్రజలు మండి పడుతున్నారు. రాజకీయ అండదండలు బడా వ్యాపారులు, రియల్ ఎస్టేట్ మాఫియా సిండికేటర్లుగా మారి ప్రభుత్వ భూములు చెరువులు కుంటలు నాళాలు యదేచ్చగా కబ్జా చేస్తూ విలాసవంతమైన భవనాలు నిర్మిస్తున్నారని ప్రజల నుంచి ఆయా మున్సిపాలి టీలకు గ్రామ పంచాయతీలకు ఫిర్యాదులు అందుతున్నాయి.
ఆక్రమణల్లో మంత్రులు ఎమ్మెల్యేల కింది స్థాయి ఖద్దరు చొక్కా లీడర్లు ఉన్నారని సర్వత్ర విమర్శలు ఉన్నా యి. ఫలితంగా చిన్నపాటి వర్షాలకే రోడ్లన్నీ కుంటలుగా మారి ఇళ్లల్లోకి మురుగునీరు కూడా వచ్చి చేరుతోందని సామాన్యులు తీవ్ర మండిపడుతున్నారు. ఆ కొద్ది సమయంలో మున్సిపాలిటీ సిబ్బంది చేత మురి గి నీటిలోకి దింపి హంగామా చేసే మున్సిపల్ అధికారులు శాశ్వత పరిష్కారం దిశగా ఆక్రమణలను తొలగించడంలో మాత్రం వెనకడుగు వేస్తున్నారు.
ఇందులో రాజకీయ నేతల అండదండలతో పాటు ఆయా మున్సిపాలిటీల్లోని అవినీతి అక్రమార్కులు కూడా తోడయ్యారని తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. ఆక్రమణలు జరిగాయని నోటీసులు ఇస్తూ నోటీసుల ఆధారంగా ముడుపులు తీసుకొని వదిలేస్తున్నారని విమర్శలు కూడా ఉన్నా యి. హైదరాబాద్ వంటి నగరాల్లో ప్రజలు పడుతున్న ఇబ్బందులను గుర్తించి హైడ్రా పేరుతో తీసుకొచ్చిన ప్రత్యేక వ్యవస్థను జిల్లాల్లోనూ ఎందుకు తీసుకురావడం లేదని రా జకీయ లబ్ధి కొరకేనా అంటూ సామాన్యులు మండిపడుతున్నారు.
రోజు రోజుకి రెట్టింపు ఆక్రమణలు
నాగర్కర్నూల్, కల్వకుర్తి, అచ్చంపేట, కొల్లాపూర్ మున్సిపాలిటీల పరిధిలో పట్టణాలు వేగంగా విస్తరించగా పట్టణాలకు ఆనుకొని ఉన్న చెరువులు, కుంటలు, నాలా లు, రోడ్లను ఆక్రమిస్తూ సెట్బ్యాక్ లేకుండా అక్రమార్కులు, రియల్ వ్యాపారులు అనేక నిర్మాణాలు చేపట్టినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. నాగర్ కర్నూల్ కేసరి సముద్రం చెరువు శిఖం భూములను సుమారు 45 ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలు జరిపినట్లు గతంలోనే మున్సిపల్ ఇరిగేషన్ రెవెన్యూ శాఖలు నేషనల్ గ్రీన్ ట్రిబనల్ కోర్టుకు నివేదికలు సంతారు.
చట్ట ప్రకారం చికన్ భూ ముల్లో కబ్జాలు ఉన్నట్లు తేలిన వెంటనేఅక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాల్సిన మున్సిపల్ టౌన్ ప్లానింగ్, ఎన్ఫోర్స్మెంట్ వ్యవస్థలు కేవలం నోటీసులకే పరిమితమయ్యాయని, అనంతరం రాజకీయ ఒత్తిళ్లు, అవినీతి కారణంగా చర్యలు నిలిచిపోతున్నాయనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. చెరు వుకు బయో ఫెన్సింగ్ ఏర్పాటు చేయకపోవడంతో కొత్త ఆక్రమణలు కూడా పెరుగుతు న్నాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
హైడ్రా జిల్లాలకు వర్తించదా..?
హైదరాబాద్లో హైడ్రా ద్వారా అక్రమ ని ర్మాణాల తొలగింపుపై ప్రభుత్వం కఠిన చర్యలు చేపడుతుండగా, జిల్లాల్లో అదే తర హా చర్యలు ఎందుకు కనిపించడం లేదని ప్ర జలు ప్రశ్నిస్తున్నారు. చెరువులు, కుంటలు, నాలాలు, ప్రభుత్వ భూములను ఆక్రమించి నిర్మాణాలు కొనసాగుతున్నా అధికారులు ఎందుకు స్పందించడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత ప్రభుత్వ హయాం లో జరిగిన అక్రమాలకు, ప్రస్తుతం అధికారంలో ఉన్న నాయకుల అండ కూడా లభి స్తోందన్న ప్రచారం జరుగుతోంది.






