ఘనంగా తల్లిపాల వారోత్సవాలు
మల్లాపూర్, ఆగస్టు, 3(విజయక్రాంతి): మండలంలోని చిట్టాపూర్ గ్రామంలో సోమవారం తల్లిపాల వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ స ర్పంచ్ సంపతీ శంకరమ్మ మాట్లాడుతూ, శి శువు ఆరోగ్యకరమైన ఎదుగుదలకు తల్లిపా లు ఎంతో అవసరమని పేర్కొన్నారు. పుట్టినప్పటి నుంచి తొలి ఆరు నెలల వరకు శిశు వుకు పూర్తిగా తల్లిపాలు మాత్రమే అందించ డం వల్ల రోగనిరోధక శక్తి పెరిగి, అనేక వ్యా ధుల నుంచి రక్షణ లభిస్తుందని తెలిపారు.
తల్లిపాలు శిశువుకు సంపూర్ణ పోషకాహారమని, ప్రతి తల్లి వాటి ప్రాముఖ్యతను గు ర్తించి పిల్లలకు తప్పనిసరిగా అందించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ బాల్సని ప్రణయ్ గౌడ్, గ్రామ కార్య దర్శి రూత్త అశోక్, వార్డు సభ్యులు, అంగన్వాడీ టీచర్లు, వైద్య సిబ్బంది, ఆశా కార్యక ర్తలు, గర్భిణులు, బాలింతలు పాల్గొన్నారు. తల్లిపాల ప్రాధాన్యంపై అవగాహన కల్పిస్తూ ఆరోగ్య సూచనలు అందించారు.






