30 July, 2026 | 1:55 AM

డ్రగ్స్‌కు అడ్డుకట్ట వేద్దాం.. యువతను కాపాడుదాం

30-07-2026 12:45 AM
  1. నషా ముక్త్ భారత్ అభియాన్‌లో భాగంగా కిమ్స్‌లో అవగాహన 
  2. ముఖ్య అతిథిగా ఈగల్ ఫోర్స్ ఎస్పీ సీతరామ్ 
  3. మాదక ద్రవ్యాలపై అప్రమత్తంగా ఉండాలని పిలుపు

హైదరాబాద్, జూలై 29(విజయక్రాంతి): యువత మాదకద్రవ్యాలు, మద్యం వంటి వ్యసనాలకు దూరంగా ఉంటేనే వారి భవిష్య త్తు ఉజ్వలంగా ఉంటుందని తెలంగాణ ఈగ ల్ ఫోర్స్ ఎస్పీ సీతరామ్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘నషా ముక్త్ భారత్ అభియాన్’ కార్యక్రమంలో భాగంగా బుధవారం కిమ్స్ హాస్పిటల్స్- ఎడ్యూకేషనల్ సొసైటీ ఆ ధ్వర్యంలో డ్రగ్స్, మద్యం తదితర వ్యసనాల దుష్ప్రభావాలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ సోషల్ మీడియా ప్రభా వం, చెడు స్నేహాల కారణంగా కొందరు యువత చిన్న వయసులోనే మాదకద్రవ్యా లు, మద్యానికి బానిసలవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పిల్లల ప్రవర్తనపై తల్లిదం డ్రులు నిరంతరం నిఘా ఉంచి, మంచి విలువలు అలవర్చాలని సూచించారు. మరో ముఖ్యఅతిథి హైకోర్డు న్యాయవాది బి. కవిత యాదవ్ మాట్లాడుతూమాదకద్రవ్యాలు యువత జీవితాలను నాశనం చేస్తున్నాయన్నారు.

విద్యార్థి దశ నుంచే బాధ్యతాయుతం గా మెలగాలని, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని సూచించారు. కిమ్స్ ఎడ్యూకేషన్ డైరెక్టర్ డాక్టర్ మణిమాల రావు మాట్లాడారు. ఈ  కార్యక్రమంలో కేఈఎస్ గ్రూప్ ఆఫ్ ఇనిస్టిట్యూషన్ ప్రిన్సిపల్స్ డాక్టర్ ఐ. వేంకటేశ్వర్లు, డాక్టర్ ప్రసూన, ప్రొఫెసర్ రెడ్డి రాణి, హెన్న, సునీత, కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.