కాంగ్రెస్‌ను బలోపేతం చేద్దాం: ఎమ్మెల్యే వెడ్మ
24-03-2026 12:03 AM
ఖానాపూర్, మార్చి 23 (విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఐక్యంగా ముందుకు వెళ్దామని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు సోమవారం జిల్లా కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి జునైద్ మెమన్, జిల్లా కార్యదర్శి ఖిజర్ ఎమ్మెల్యేలను కలిసి సన్మానం చేశారు ఈ కార్యక్రమంలో నిర్మల్ జిల్లా గ్రంథాలయ చైర్మన్ అర్జుమాంద్ అలీ, మాజీ మున్సిపల్ చైర్మన్ ఖానాపూర్ రాజురా సత్యం, మైనార్టీ పట్టణ అధ్యక్షులు నిర్మల్ మతిన్, మండల అధ్యక్షులు దయానంద్, మాజీ మున్సిపల్ కౌన్సిలర్ ఖానాపూర్ షబ్బీర్ పాషా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.




