24 March, 2026 | 5:54 PM

చదువుతోపాటు సేవాభావాన్ని కలిగి ఉండాలి

24-03-2026 12:03 AM

కాళేశ్వరం, మార్చి 23 (విజయక్రాంతి): చదువుతోపాటు విద్యార్థులకు సేవాభావం చిన్నతనం ఉండే కలిగి ఉండాలని పలువురు వక్తలు ఉద్బోధించారు. మహదేపూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎన్‌ఎస్‌ఎస్ (జాతీయ సేవా పథకం) ఆధ్వర్యంలో కాళేశ్వర గ్రామ పంచాయతీ పరిధిలో ఏడు రోజుల ప్రత్యేక క్యాంపును నిర్వహిస్తున్నారు.

ఈ కార్యక్రమంలో ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ ఈ. మాధవి, కళాశాల ప్రిన్సిపాల్ జన్ను విజయకుమార్, ఉపసర్పంచ్ సుధీర్, వార్డు సభ్యులు ఇమ్రాన్, రాజశేఖర్, అధ్యాపకులు, వాలంటీర్లు పాల్గొన్నారు.