15 July, 2026 | 1:29 AM

శ్రీ గుంటి రఘునాథస్వామి దేవస్థానం భూముల కౌలు వేలం

15-07-2026 12:00 AM

కోదాడ, జూలై 14: కోదాడ పట్టణంలోని శ్రీ గుంటి రఘునాథస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో దేవస్థానానికి చెందిన వ్యవసాయ భూముల బహిరంగ కౌలు వేలం మంగళవారం నిర్వహించారు. వేలం ప్రక్రియను ఈవో చలపతి ఆధ్వర్యంలో పారదర్శకంగా నిర్వహించారు. రైతులు, కౌలుదారుల సమక్షంలో పోటీపడి కౌలు పాటలు పాడగా, అత్యధిక కౌలు పాడిన వారికి భూములను కేటాయించారు.

వేలంలో 1 ఎకరం 30 కుంటల వ్యవసాయ భూమిని ఇమ్మడి రమేష్ వార్షిక కౌలుగా రూ.40 వేలకు దక్కించుకోగా, 2 ఎకరాల 8 కుంటల భూమిని పిన్నబోయిన శ్రీను వార్షిక కౌలుగా రూ.40 వేలకు కౌలుకు పొందారు. వేలం ప్రక్రియను దేవాదాయ శాఖ నిబంధనల మేరకు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ గురుగుంట్ల భాస్కర్, కమిటీ సభ్యులు, వేనపల్లి శ్రీనివాసరావు, పిచ్చయ్య, పురోహితులు రాఘవాచార్యులు, రైతులు, కౌలుదారులు తదితరులు పాల్గొన్నారు.