15 July, 2026 | 1:36 AM

ఎన్యూమరేషన్ ఫారాల సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలి

15-07-2026 12:00 AM

కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ 

సూర్యాపేట, జులై 14 (విజయక్రాంతి): ఎన్యుమరేషన్ ఫారాల సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్  అన్నారు. బీఎల్‌ఓలు ఇంటింటికీ వెళ్లి ఓటర్లకు ఎన్యుమరేషన్ ఫారాలు అందజేసి, వివరాలను సక్రమంగా నమోదు చేయాలని సూచించారు. మంగళవారం సూర్యాపేట పట్టణంలోని 27 వార్డులో సర్ ప్రక్రియను పరిశీలించారు. ప్రతి రోజు కనీసం 2,500 ఫారాల లక్ష్యంతో పని చేసి, నిర్దేశిత గడువులోగా పెండింగ్ ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు.

ఓటర్లు సకాలంలో ఫారాలు పూర్తి చేసి అందజేసేలా చర్యలు తీసుకోవాలని, ఎక్కడా నిర్లక్ష్యం లేకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని కలెక్టర్ తెలిపారు. బిఎల్‌ఓ లు ఇంటింటికి తిరిగి ఫారం నింపాలని చెప్పారు. ఓటర్ల సంతకాలను చెక్ చేసుకోవాలని, మ్యాపింగ్ కరెక్ట్ గా చేయాలన్నారు. కార్యక్రమంలో ఆర్డిఓ వేణు మాధవరావు తహసిల్దార్ సాయి గౌడ్, బి ఎల్ ఓ లు తదితరులు పాల్గొన్నారు.