వెల్‌నెస్ సెంటర్‌పై పర్యవేక్షణ కరువు
- చూసి చూడనట్టు వ్యవహరిస్తున్న అధికార యంత్రాంగం
- ఎప్పుడు వెళ్లిన మందుల కొరత
- వెల్నెస్ సెంటర్ పై ఆధారపడ్డ ఉమ్మడి జిల్లా ఉద్యోగ,రిటైర్డ్ ఉద్యోగులు, జర్నలిస్టు లు
మహబూబ్ నగర్ క్రైం, జూలై 14 : ఉద్యోగులు, పెన్షనర్లు జర్నలిస్టుల వైద్య సేవలు మరింత అందుబాటులో ఉంచాలని సంకల్పంతో ఏర్పాటు చేసిన వెల్నెస్ సెంటర్ల నిర్వహణ అగమ్య గోచరంగా తయారైంది. వైద్య సేవలు నిమిత్తం ఎప్పుడు వెళ్లి వెల్ నెస్ సెంటర్ ను సంప్రదించిన మందులు మాత్రం అందుబాటులో అన్ని ఉండవు. అరకురగా ఒకటి ఉంటే నాలుగు మందులు అందుబాటులో ఉండకపోవడంతో అవి కూడా బయటనే కొనుగోలు చేయాల్సిన దుస్థితి ఏర్పడుతుంది. ఇది అంత శరమాములే అనే విధంగా నిర్వాణ అధికారులు నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంది. ఎన్ని మాటలు సంబంధిత అధికారులకు చెప్పినప్పటికీ ఎలాంటి ఉపయోగం లేకుండా పోతుంది.
నిండు నిర్లక్ష్యం దర్శనం...
ఉమ్మడి జిల్లా నుంచి ఉద్యోగులు, పెన్షనర్లు, జర్నలిస్టులు వెల్నెస్ సెంటర్ ను సంప్రదించి వైద్య సేవలు పొందేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. కాగా ఎంత దూరం నుంచి వచ్చినప్పటికీ ఇక్కడ అంత దూరంగా సదుపాయాలు ఉంటున్నాయి.
సరియైన మందులు అందుబాటులో ఉంచాల్సిన సంబంధిత నిర్వహణ అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దూర ప్రాంతాల నుంచి వచ్చినప్పటికీ మందులు అందుబాటులో లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు. వైద్యులు సైతం పూర్తిస్థాయిలో లేకపోవడంతో ఏ రోగానికి చూయించుకోవాల్సి వచ్చినప్పటికీ ఆ సంబంధిత వైద్యులు అందుబాటులో లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు. ఇలాంటి వెల్నెస్ సెంటర్ వల్ల ఉపయోగం ఏముంటుందని అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ఉన్నత అధికారులు స్పందించాలి...
ఉన్నత అధికారులు స్పందించాల్సిన అవసరం ఉన్నప్పటికీ ఎవరు స్పందించకపోవడంతో రోజురోజుకు నిర్లక్ష్యం ప్రత్యక్షంగా కనిపిస్తుంది. ఎవరి పనులు వారు చేయకుండా వారు చేస్తలేరు వీరు చేస్తలేరన్న అంటూ లోలోపలనే అంతర్యుద్ధం సృష్టించుకుని అవసరమైన వారికి వైద్య సేవలు కల్పించడంలో వెల్నెస్ సెంటర్ పూర్తిగా విఫలమవుతుంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి సమర్థవంతంగా వెల్నెస్ సెంటర్ నిర్వహించి అవసరమైన వారికి వైద్య సేవలు అందుబాటులో ఉంచాలని కోరుతున్నారు.






