పెండింగ్‌లో ఉన్న ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాలి
దామరచర్ల , జులై 14 :రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని బీసీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ జాజుల లింగంగౌడ్ అన్నారు.దామరచర్ల లో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.వేలాది మంది విద్యార్థులు ఫీజు బకాయిలు విడుదల కాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఉన్నత విద్య కొనసాగించడంలో అనేక ఆటంకాలు ఏర్పడుతున్నాయని పేర్కొన్నారు.
విద్యార్థుల భవిష్యత్తుతో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదని ఆయన విమర్శించారు.రాష్ట్రంలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ ప్రజాప్రతినిధులు రాజకీయాలకు అతీతంగా స్పందించి, ముఖ్యమంత్రి పై ఒత్తిడి తీసుకువచ్చి పెండింగ్లో ఉన్న ఫీజు బకాయిలన్నింటినీ తక్షణమే విడుదల చేయించేలా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.పేద , మధ్యతరగతి విద్యార్థుల చదువులకు భరోసా కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని, ఆలస్యం చేయకుండా ఫీజు బకాయిల విడుదలపై స్పష్టమైన నిర్ణయం ప్రకటించాలని ఆయన చేశారు.






