ఇంటర్ ఫలితాల్లో కృష్ణవేణి విజయభేరి
ప్రతిభ చూపిన కళాశాల విద్యార్థులు
హైదరాబాద్, ఏప్రిల్12(విజయక్రాంతి): ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో కృష్ణవేణి జూనియర్ కళాశాల విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించారని కళాశాల డైరెక్టర్లు గొల్లపూడి జగదీష్, మాచవరపు కోటేశ్వరరావు, యార్లగడ్డ వెంకటేశ్వరరావు పేర్కొన్నారు.
సీనియర్ ఇంటర్ ఎంపీసీలో 1000 మార్కులకు గాను కె.కావ్యకళ 995, ఎన్. చందన 995, ఎస్.నవదీప్ వీ గణేష్ 994, బైపీసీలో 1000 మార్కులకు గాను జి.ప్రహర్ష 994, బి సాయి కీర్తన 992, జెఎల్‌ఎస్ మైత్రేయి 990, జూనియర్ ఇంటర్ ఎంపీసీ విభాగంలో 470 మార్కులకు గాను బి.ఉదయ్ కిరణ్ సీహెచ్ భావన 468, యువీ ప్రణవి 468, జె.లోహితశ్రీ 467, ఎం.శ్రావ్య సాత్విక 46౭, పి.హవిల 467, కే.జోష్నా 467, ఆర్ మనీషా 467, ఎస్.నందిని 467, కె పల్లవి శ్రీద్గు 467, జూనియర్ ఇంటర్ బైపీసీ విభాగంలో 440 మార్కులకు గాను ఎల్ లోకేష్ 437, సీహెచ్ ప్రశాంత్ 437, బి సమత 436, జి అఖిల 436, బి జెస్సికా 436, ఎండీ నౌషీన్ 435, బి శ్రావణి 435, ఈ నిహారిక 435, పి.రిత్విక్‌రెడ్డి 435, ఎంఈసీ విభాంలో 500 మార్కులకుగాను ఆర్.దీపిక శరణ్య 496, సీఈసీ విభాగంలో 500 మార్కులకు గాను ఈ గీతిక 489, జె.జయేని 488 మార్కులు సాధించారు. ప్రతి ఏడాది రాష్ట్రస్థాయి అత్యధిక మార్కులు సాధించడం వెనక నిరంతర కృషి, విద్యార్థుల సహకారం, అధ్యాపకుల తల్లిదండ్రుల తోడ్పాటు ప్రధాన కారణం అన్నారు. ఈ కార్యక్రమంలో అకాడమిక్ డీన్ ఏలూరి వంశీకృష్ణ, ఏవో నిరంజన్, హెచ్‌ఓడీలు లక్ష్మణ్, రాజశేఖర్‌రెడ్డి, అధ్యాపక బృం దం, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు.




