నల్ల నేలపై మెరిసిన వైష్ణవి
సింగరేణి కార్మికుడి కూతురు స్టేట్ సెకండ్
మంచిర్యాల, ఏప్రిల్ 12 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఇంటర్ ఫలితాలలో సింగరేణి కార్మికుడి కూతురు ప్రతిభ కనబర్చి రాష్ట్ర స్థాయి ర్యాంకు సాధించింది. సింగరేణి కార్మికుడుగా మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియా ఆర్ కే - 5 గనిలో జనరల్ మజ్దూర్ గా విధులు నిర్వహిస్తున్న రెంకా చంద్రమౌళి కూతురు రెంకా వైష్ణవి ఇంటర్ సెకండ్ ఇయర్ బైపీసీ విభాగంలో 995 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో రెండవ స్థానంలో, ఉమ్మడి ఆదిలాబాద్ టాపర్ గా నిలిచింది.
పదవ తరగతిలో 10 జీపీఎ సాధించి డాక్టర్ కావాలనే లక్ష్యంతో మంచిర్యాలలోని ఓ ప్రైవేటు కళాశాలలో చదువుతూ ఇంటర్‌లో రాష్ట్ర స్థాయిలో టాపర్‌గా నిలిచింది. నీట్ లో మంచి ర్యాంకు సాధించి మెడిసిన్ పూర్తి చేసి వైద్యురాలుగా స్థిరపడి సింగరేణి కార్మికులకు, పేదలకు సేవ చేయడమే లక్ష్యంగా వైష్ణవి పేర్కొంది.




