13 April, 2026 | 4:16 PM

Breaking News

కాంగ్రెస్ కుంభకోణాల ప్రభుత్వం— సీతక్క చెప్పుతో కొడ్తా అనడం ఏంటి?   •   ఆధైర్యపడవద్దు అండగా ఉంటాం: ఎమ్మెల్యే   •   బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడుకి సన్మానం   •   జిల్లెల్ల గ్రామంలో ఘనంగా రోడ్డు భద్రత మహోత్సవం   •   రేవంత్‌రెడ్డికి అవగాహన లేదు— డీలిమిటేషన్‌పై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు   •   బస్వాపూర్ గ్రామంలో రోడ్డు భద్రతపై అవగాహన గ్రామసభ విజయవంతం   •   తంగళ్ళపల్లిలో రోడ్డు భద్రతపై గ్రామసభ - అవగాహన కార్యక్రమాలు   •   కేసీఆర్‌కు మంత్రి సీతక్క లీగల్‌ నోటీస్   •   దొంగతనం కేసును ఛేదించిన బిక్కనూర్ పోలీస్   •   ప్రొఫెసర్ డాక్టర్ శ్రీధర్ కు కళాశాలలో ఘనంగా నివాళులు   •  

క్రాంతి మార్పు కోసం పనిచేశారు.

13-04-2026 02:18 PM

ములకలపల్లి,(విజయక్రాంతి): సమాజంలో మార్పు కోసం క్రాంతి పని చేశారని పలువురు వక్తలు కొనియాడారు. మావోయిస్టుగా పనిచేసి తర్వాత కాలంలో జర్నలిస్ట్ గా పనిచేస్తూ మార్చి 30వ తేదీన గుండెపోటుతో మృతి చెందిన పోతుగంటి బ్రహ్మం (@ క్రాంతి) సంతాపసభను ఆయన స్వగ్రామమైన ములకలపల్లి మండలంలోని తిమ్మంపేట నిర్వహించారు. అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు క్రాంతి చిత్రపటానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు.

సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు నరాటి ప్రసాద్ అధ్యక్షతన ఏర్పాటైన సంతాప సభలో పలువురు మాట్లాడారు. క్రాంతి ధైర్యవంతుడని నాయకత్వ లక్షణాలు కలిగిన వ్యక్తి అని  మావోయిస్టుగా పనిచేసి పోలీసు అరెస్టు తర్వాత జర్నలిస్టుగా తన ప్రయాణాన్ని ప్రారంభించి పాత్రికేయ వృత్తికి న్యాయం చేశారని ఆయన సేవలను కొనియాడారు.అనేక సమస్యలను ప్రభుత్వం,అధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కారానికి పనిచేశారన్నారు. తిమ్మంపేట సర్పంచ్ తుర్రం శ్రీనివాసరావు,సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ మండల కార్యదర్శి కోర్సా రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.