కాంగ్రెస్ ప్రభుత్వంపై పోచారం సీరియస్
సిద్దాపూర్ రిజర్వాయర్ నిధులు మంజూరులో సీఎం, మంత్రులు, పట్టించుకోవడం లేదని ఆవేదన
ఇప్పుడు కాకుంటే ఎప్పుడు కాదని ఆవేదన వ్యక్తం చేసిన పోచారం
నిధులు మంజూరు చేసే వరకు అర్ధరాత్రి వరకు వేచి ఉంటా..
సీఈ తో మాట్లాడిన పోచారం
కామారెడ్డి,(విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government)పై రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి(Banswada MLA Pocharam Srinivas Reddy) సీరియస్ అవుతున్నారు. బాన్సువాడ నియోజకవర్గంలోని సిద్దాపూర్ రిజర్వాయర్ కు నిధులు మంజూరు లో చేయిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు హామీ ఇచ్చారని, నిధుల కోసం అడుగుతే పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సిద్ధాపూర్ రిజర్వాయర్ నిర్మాణం జరిగితే 10 గ్రామాల రైతులకు సాగునీరు అందుబాటులోకి వస్తుందన్న ఉద్దేశంతో తాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) నీటిపారుల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డిని కలిసి విన్నవిస్తే నిధులు మంజూరు చేస్తామని చెప్పి ప్రస్తుతం పట్టించుకోవడంలేదని అన్నారు.
తనకు 20 సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవంతో పాటు మంత్రిగా, స్పీకర్ గా పనిచేసిన తాను మంత్రికి 20 సార్లు చెప్పా నిధులు మంజూరు చేయాలని అయినా పట్టించుకో వడం లేదు అన్నారు. ఈ ప్రభుత్వంలో మంత్రులు ఎమ్మెల్యేలు ఫోన్లు లేపడం లేదన్నారు. ముఖ్యమంత్రి ఇచ్చిన మాట తప్పిండు అన్నారు. సిద్దాపూర్ రిజర్వాయర్ పనులకు నిధులు మంజూరు చేస్తేనే కదులుతానని లేకుంటే ఇక్కడే ఉంటానని సీఈకి ఫోన్ ద్వారా పోచారం శ్రీనివాస్ రెడ్డి హెచ్చరించారు. ఈ వయసులో నిధులు మంజూరు చేయాలని మంత్రుల కాళ్లు మొక్కాలా అని ప్రశ్నించారు. బిఆర్ఎస్ హాయంలో ఇంట్లో కూర్చుంటే జీవోలు వచ్చాయని గుర్తు చేశారు. ప్రభుత్వము ఉందా... ఉంటే పనిచేస్తుందా అని ప్రశ్నించారు. తన అనుచరులతో కలిసి పోచారం శ్రీనివాస్ రెడ్డి సిద్దాపూర్ రిజర్వాయర్ వద్ద బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.
పోచారం పార్టీ మారనున్నారా...?
బాన్సువాడ ఎమ్మెల్యే మాజీ స్పీకర్, మాజీ మంత్రి, రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి మళ్ళీ బిఆర్ ఎస్ లోకి వెళ్తారు అనడానికి ఆదివారం రాత్రి బాన్సువాడ నియోజకవర్గంలోని సిద్ధాపూర్ రిజర్వాయర్ వద్ద ప్రభుత్వ తీరు ముఖ్యమంత్రి, మంత్రుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విషయం పై పోచారం పార్టీ మారనున్న రనడానికి నిదర్శనంగా అనిపిస్తుందని స్థానికులు అంటున్నారు. బిఆర్ఎస్ నుంచి బాన్స్వాడ ఎమ్మెల్యేగా గెలుపొందిన పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం విధితమే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్ద కండువా మార్చుకున్న పోచారం శ్రీనివాస్ రెడ్డి కి రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారుగా అవకాశం కల్పించారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ లో చేరడంతో బాన్స్వాడ నియోజకవర్గంలో కాంగ్రెస్ బాన్సువాడ నియోజకవర్గ ఇన్చార్జి ఏనుగు రవీందర్ రెడ్డితో విభేదించారు.
గ్రూపుల రాజకీయంగా బాన్సువాడ కాంగ్రెస్లో నెలకొంది. కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన వారు పోచారం కాంగ్రెస్లో చేరడంతో పలువురు బిఆర్ఎస్ లోకి చేరారు. ప్రస్తుతం పోచారం శ్రీనివాస్ రెడ్డి అనుచరులు బిఆర్ఎస్ లోనే ఎక్కువగా ఉన్నారు. ఇటీవల కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి టిఆర్ఎస్ లో ఈనెల 20న చేరనుండడంతో పోచారం తనయుడు భాస్కర్ రెడ్డి జీవన్ రెడ్డితో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. తిరిగి పోచారం శ్రీనివాస్ రెడ్డి టిఆర్ఎస్ లోకి వస్తాడని కెసిఆర్ దృష్టికి తీసుకెళ్లి అనుమతి ఇస్తే తిరిగి బీఆర్ఎస్ లో పోచారం చేస్తారని అతని తనయుడు మాజీ డిసిసిబి చైర్మన్ భాస్కర్ రెడ్డి జీవన్ రెడ్డి ద్వారా వర్తమానం పంపినట్లు తెలుస్తుంది. అక్కడి నుంచి పోచారం కు లైన్ క్లియర్ రావడం వల్లనే కాంగ్రెస్ ప్రభుత్వం పై పోచారం సీరియస్ అయ్యారని వదంతులు వినిపిస్తున్నాయి. పోచారం తీరుపై బాన్సువాడ నియోజకవర్గంలోని కాంగ్రెస్, బిఆర్ఎస్ నాయకులు అయోమయంలో ఉన్నారు.




