23 March, 2026 | 5:57 AM

విద్యార్థుల్లో ధైర్యం,క్రమశిక్షణ పెంచేది కరాటే

23-03-2026 12:43 AM

ప్రభుత్వ విప్  శ్రీనివాస్

వేములవాడ, మార్చి 22,(విజయక్రాంతి)ఆత్మరక్షణ నైపుణ్యాలు ప్రతి ఒక్కరికీ అవసరమని, విద్యార్థులు కరాటే వంటి మార్షల్ ఆరట్స్ నేర్చుకోవడం ద్వారా ధైర్యం, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం పెంపొందుతాయని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు.వేములవాడ పట్టణంలోని మహాలింగేశ్వర గార్డెన్లో ఆదివారం నిర్వహించిన ఓకినవ స్పోరట్స్ కరాటే అకాడమీ 35వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.

ముఖ్య అతిథిగా హాజరైన ఆయన ముం దుగా కేక్ కట్ చేసి వేడుకలను ప్రారంభించారు.తదుపరి అర్బన్ కాలనీలో జరిగిన ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు నూతన వస్త్రాలు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కరాటే కేవలం పోరాట విద్య మాత్రమే కాదని, ఇది శారీరక దృఢత్వం, మానసిక స్థైర్యం, ఏకాగ్రతను పెంపొందించి విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి తో డ్పడుతుందని అన్నారు.

గత 35 సంవత్సరాలుగా అకాడమీ మాస్టర్ అబ్దుల్ మన్నన్ ఆధ్వర్యంలో వేలాది మంది విద్యార్థులను క్రీడాకారులుగా తీర్చిదిద్దడం అభినందనీయమని కొని యాడారు.కరాటే విద్య అనుకోని ప్రమాదాల సమయంలో రక్షణ కల్పించడమే కాకుండా యువతలో సాహసాన్ని పెంచి జీవిత సవాళ్లను ఎదుర్కొనే ధైర్యాన్ని ఇస్తుందని తెలిపారు.

విద్యార్థుల భవిష్యత్తుకు కరాటే బంగారు బాట వేస్తుందని, తల్లిదండ్రులు తమ పిల్లలను చిన్న వయసులోనే మార్షల్ ఆరట్స్ వైపు ప్రోత్సహించాలని సూచించారు.అనంతరం అకాడమీ ఫౌండర్ అబ్దుల్ మన్నన్, ఆది శ్రీనివాస్ ను పూలమాలలు, శాలువాలతో ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ పుల్కం రాజు, వైస్ చైర్మన్ నరాల శేఖర్, కరాటే అసోసియేషన్ రాష్ట్ర నాయకులు కె. వసంత్ కుమార్, సీనియర్ మాస్టర్లు, మున్సిపల్ కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.