2 May, 2026 | 6:27 PM

కామారెడ్డి ప్రమో రన్ విజయవంతం

02-05-2026 05:13 PM

కామారెడ్డి,(విజయక్రాంతి): నగరంలో ఫిట్‌నెస్, రన్నింగ్ సంస్కృతిని ప్రోత్సహించే లక్ష్యంతో నిర్వహించిన కామారెడ్డి ప్రమో రన్ 2026 శనివారం విజయవంతంగా జరిగింది. ఇందిరా గాంధీ స్టేడియంలో తెలంగాణ రన్నర్స్ సొసైటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని స్థానిక కామారెడ్డి ఎస్హెచ్ఓ నరహరి, అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఆర్ కె జైపాల్ రెడ్డి, పున్న రాజేశ్వర్ గారు జండా ఊపి ప్రారంభించగా,  తెలంగాణ రన్నర్స్ సొసైటీ రాష్ట్ర అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి, కార్యవర్గ సభ్యులు ప్రీతమ్, భాస్కర్ ఉప్పల్ల, కామారెడ్డి రన్ డైరెక్టర్ జ్యోత్స్న, పున్న రాజేష్ ల సమన్వయంతో నిర్వహించారు.

గజ్వేల్ రన్నర్స్‌కు చెందిన నిఖిల్ రెడ్డి, జనార్ధన్, స్కూల్స్ & కాలేజెస్ స్టూడెంట్స్,  ఎన్సిసి, ఎన్ఎస్ఎస్ విద్యార్థులు ఆర్గనైజింగ్ టీమ్‌లో భాగమయ్యారు. ఈ రన్‌లో 2కే ఫ్యామిలీ రన్, 5కే ఫన్ రన్, 10కే ప్రధాన రన్ విభాగాల్లో పెద్ద సంఖ్యలో యువత, కుటుంబాలు, ఫిట్‌నెస్ ఆసక్తిగల వారు ఉత్సాహంగా పాల్గొన్నారు. పాల్గొన్న వారికి టీ-షర్టులు, ఫినిషర్ మెడల్స్, అల్పాహారం  అందించారు.

ఈ కార్యక్రమానికి అవంతిక కన్స్ట్రక్షన్స్, మెడ్‌వన్ హాస్పిటల్స్, లిటిల్ స్కాలర్స్ హై స్కూల్, కామారెడ్డి సంస్థలు స్పాన్సర్లుగా సహకరించాయి. అలాగే పాల్గొన్న వారికి అల్పాహారం  బాంబే క్లాత్ హౌస్ యజమాన్యం ఏర్పాటు చేశారు. కార్యక్రమం ద్వారా నగర ప్రజల్లో ఆరోగ్యంపై అవగాహన పెంపొందించడంతో పాటు రన్నింగ్ పై ఆసక్తి పెరిగిందని నిర్వాహకులు తెలిపారు. ఈ ప్రమో రన్, జూన్ 7న హైదరాబాద్ నెక్లెస్ రోడ్ వద్ద జరగనున్న అవంతిక తెలంగాణ రన్ 2026కి ప్రొత్సహకంగా నిర్వహించినట్లు తెలిపారు.