అంగరంగ వైభవంగా శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం వేడుకలు
సర్పంచ్ ఉప్పు లక్ష్మీ తిరుపతి ఆధ్వర్యం లో పెద్ద ఎత్తున పాల్గొన్న భక్తులు
సుల్తానాబాద్,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం మంచరామి గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం వేడుకలు అంగరంగ వైభవంగా కన్నుల పండువగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ ఉప్పు లక్ష్మి, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి తిరుపతి దంపతుల ఆధ్వర్యంలో కళ్యాణం నిర్వహించారు. ఈ వేడుకలో గ్రామ పాలకవర్గ సభ్యులు, పెద్దలు, గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. భక్తి శ్రద్ధలతో నిర్వహించిన ఈ కళ్యాణ మహోత్సవం గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం అన్నదానం కార్యక్రమం నిర్వహించారు, గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు, ఈ సందర్భంగా సర్పంచ్ ఉప్పు లక్ష్మి తిరుపతి మాట్లాడుతూ, గ్రామంలో ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఐక్యత, భక్తి భావం పెంపొందుతుందని తెలిపారు.






