15 July, 2026 | 12:40 AM

ఎస్‌ఈ సాయినాథ్‌కు ఐఎన్‌టీయూసీ ఘన స్వాగతం

15-07-2026 12:40 AM

శాలువాతో సత్కరించిన ఐఎన్టీయూసీ వైస్ ప్రెసిడెంట్ కోటేశ్వరరావు

సత్తుపల్లి జూలై14( విజయ క్రాంతి): నూతనంగా జె.వి.ఆర్. సి.హెచ్.పి.లో సెక్షన్ ఇంజనీర్ ఈ అండ్ ఎం గా బాధ్యతలు స్వీకరించిన  సాయినాథ్ ని ఐఎన్టీయూసీ వైస్ ప్రెసిడెంట్ కోటేశ్వరరావు స్వాగతం గా ఆహ్వానించి, వారి బృందం మర్యాదపూర్వకంగా కలిసి, శాలువాతో ఘనంగా మంగళవారం సత్కరించారు. ఈ సందర్భంగా కోటేశ్వరరావు మాట్లాడుతూ, వారి పదవీకాలం విజయవంతంగా సాగాలని ఆకాంక్షించారు.

గత కొంతకాలంగా డిప్యూటీ జనరల్ మేనేజర్ ఈ అండ్ ఎం గా సేవలందించిన  సోమశేఖర్, సత్తుపల్లి ఏరియా ఇంజనీర్గా బదిలీ కావడంతో, వారి స్థానంలో సాయినాథ్ బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో బ్రాంచ్ సెక్రటరీ మురళీకృష్ణ, బ్రాంచ్ చీఫ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ షాట్రాక్ బాబు, బ్రాంచ్ నాయకులు వేణునాద్, యస్వంత్ రెడ్డి, జేవిఆర్ సి ఎచ్ పి ఫిట్ సెక్రటరీ నగేష్, రమేష్, ఇక్బాల్, డి ఎల్ ఆర్ ఇంచార్జి సుభాని, శ్రీను ఐఎన్టీయూసీ నాయకులు మరియు పలువురు ఉద్యోగులు,పాల్గొని నూతన అధికారికి శుభాకాంక్షలు తెలిపారు.