20 April, 2026 | 6:02 PM

ఎంపీపీ జడ్పిటిసి రిజర్వేషన్ కేటాయింపులో గిరిజనులకు న్యాయం చేయాలి

20-04-2026 04:58 PM

ఎంపీపీ జడ్పిటిసి స్థానాలను ఎస్టి లకు కేటాయించాలి

బిఆర్ఎస్ మండల ఎస్టీ సెల్ అధ్యక్షులు సందీప్ నాయక్

గరిడేపల్లి,(విజయక్రాంతి): రానున్న ఎంపీపీ,జడ్పిటిసి స్థానాలకు రిజర్వేషన్ కేటాయింపుల్లో మండలానికి ఎస్టీ రిజర్వుడు కేటాయించాలని బిఆర్ఎస్ మండల పార్టీ ఎస్టీ సెల్ అధ్యక్షులు గుగులోతు సందీప్ నాయక్ అన్నారు.సోమవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... గరిడేపల్లి మండలం ఏర్పడినప్పటి నుంచి ఎంపీపీ జడ్పిటిసి స్థానాలను ఇప్పటిదాకా ఎస్టీలకు కేటాయించలేదని, రానున్న ఎంపిటిసి జడ్పిటిసి ఎన్నికల్లో ఈ రెండు స్థానాలను ఎస్టీలకు కేటాయించాలన్నారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఎంపీపీ జడ్పిటిసి ఎలక్షన్ ఈసారి గరిడేపల్లి మండలానికి గిరిజనుల కేటాయించాలని కోరారు. మండలంలో ఉన్న ఎస్సీ, బీసీ అన్ని సామాజిక వర్గాల వారు ఈ పదవుల పొందినారని కేవలం గిరిజనులు మాత్రమే ఎంపీపీ జడ్పిటిసి పదవులను రిజర్వేషన్ రాక ఇప్పటిదాకా అనుభవించలేకపోయారని కనీసం ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్ కేటాయింపుల్లో జడ్పిటిసి ఎంపీపీ రిజర్వేషన్ ఎస్టీలకు కేటాయించి గిరిజనులకు తగిన న్యాయం చేయాలని కోరారు. సమావేశంలో గిరిజన నాయకులు మలిదశ ఉద్యమకారులు గుగులోతు నీలా హేమ్లా నాయక్,బాలు నాయక్,నరేందర్ నాయక్,రవీందర్ నాయక్, రామన్ నాయక్, నాగు నాయక్ తదితరులు పాల్గొన్నారు