21 July, 2026 | 8:09 AM

ఉపసర్పంచులకు విబి జీ రామ్ జీ జాయింట్ చెక్ పవర్ అమలు చేయాలి

20-07-2026 06:22 PM

ప్రజావాణిలో కలెక్టర్‌కు వినతి

నిధుల దుర్వినియోగానికి అడ్డుకట్ట పడుతుందని ఉపసర్పంచుల పోరం అభిప్రాయం

సిద్దిపేట రూరల్: విబి.జీ.రామ్ జీ నిధుల నిర్వహణలో సర్పంచ్‌తో పాటు ఉపసర్పంచులకు కూడా జాయింట్ చెక్ పవర్ కల్పించాలని కోరుతూ సిద్దిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో ఉపసర్పంచుల పోరం నాయకులు వినతిపత్రం సమర్పించారు. తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో అమలులో ఉన్న విధానాన్ని సిద్దిపేట జిల్లాలోనూ అమలు చేయాలని కలెక్టర్‌తో పాటు పంచాయతీరాజ్ శాఖ అధికారులను కోరారు. ఉపసర్పంచులకు జాయింట్ చెక్ పవర్ కల్పించడం వల్ల ఉపాధి హామీ నిధుల వినియోగంలో పారదర్శకత పెరగడంతో పాటు నిధుల దుర్వినియోగానికి అడ్డుకట్ట పడుతుందని సిద్దిపేట జిల్లా ఉపసర్పంచుల పోరం అధ్యక్షుడు మాడుగూరి రాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో వర్గల్ మండల పోరం అధ్యక్షుడు మన్నె స్వామి, నారాయణరావుపేట మండల ఉపసర్పంచుల పోరం అధ్యక్షుడు బింగ నవీన్, మిరుదొడ్డి మండల పోరం అధ్యక్షుడు పర్శరాములు, సదానంద గౌడ్ తదితరులు పాల్గొన్నారు.