అతిథి అధ్యాపక పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం
మెట్ పల్లి,(విజయక్రాంతి): జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఖాళీగా ఉన్న నాలుగు పోస్టులలో అతిథి అధ్యాపకుల నియామకం కోసం అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని, ఈ నెల 23వ తేదీ లోపు తమ దరఖాస్తులను కళాశాల కార్యాలయంలో సమర్పించాలని ప్రిన్సిపాల్ డాక్టర్ కే.వేంకయ్య తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ కళాశాలలో తెలుగు, రాజనీతి శాస్త్రం,వాణిజ్య శాస్త్రం,కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్స్ లలో పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఆ పోస్టులలో అధ్యాపకులను నియమించడానికి ఈ నెల 23 వ తేదీ మధ్యాహ్నం 3 గంటల లోపు అర్హత గల అభ్యర్థులు కార్యాలయంలో దరఖాస్తులను సమర్పించాలని ఆయన కోరారు. దరఖాస్తుతో పాటు తమ బయోడేటా మరియు అర్హత,అనుభవం వంటి అన్ని సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీల సెట్ ను విధిగా సమర్పించాలని ఆయన స్పష్టంగా పేర్కొన్నారు.






