కెల్లేడులో సర్ శత శాతం పూర్తి
20-07-2026 06:25 PM
మండలంలో మొదటి, జిల్లాలో రెండవ స్థానం
మానకొండూరు,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ఓటర్ల జాబితా సవరణ, ధ్రువీకరణ ప్రక్రియ సర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం కెల్లేడు గ్రామంలో శతశాతం (100%) పూర్తయింది. ఈ ప్రక్రియలో మానకొండూరు మండలంలో మొట్టమొదటి గ్రామంగా, కరీంనగర్ జిల్లాలో రెండవ స్థానంలో కెల్లేడు నిలిచింది. వంద శాతం పూర్తి కావడానికి సహకరించిన అధికారులకు, గ్రామ బిఎల్ఓ లు ఆడెపు స్వరూప రాణి, పెందోట శ్రీలత , సహకారం అందించిన పంచాయతీ కార్యదర్శి గసికంటి తిరుమలేశ్, కారోబార్ కాంపెల్లి రాజ్ కుమార్ లకు గ్రామ సర్పంచ్ ఆడెపు రజిత విజయ్ ఈ సందర్బంగా అభినందనలు తెలియజేసారు.






