19 May, 2026 | 2:52 AM

తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరికలు

19-05-2026 01:39 AM

ఆహ్వానించిన అధ్యక్షుడు తీన్మార్ మల్లన్న

హైదరాబాద్, మే 18 (విజయక్రాంతి): యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలానికి చెందిన పలువురు యువకులు కోరే శరత్ ఆధ్వర్యంలో సోమవారం తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టీఆర్పీ) లో చేరారు. పార్టీ అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న వారికి పార్టీ  కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మల్లన్న మాట్లాడుతూ.. రాష్ట్రంలో యువత మార్పు కోరుకుంటోందని, వారి ఆశలు ఆకాంక్షలకు ప్రతిబింబంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఎదుగుతోందని అన్నారు. బీసీ వర్గాలకు రాజకీయంగా న్యాయం జరగాలంటే యువత ముందుకు రావాలని పిలుపు నిచ్చారు. ఎన్నాళ్లుగానో అన్యాయానికి గురవుతున్న బీసీలకు నిజమైన అధికారాన్ని తీసు కురావడం టీఆర్పీ లక్ష్యమని స్పష్టం చేశారు.