calender_icon.png 14 February, 2026 | 7:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతు ఉత్పత్తిదారుల సంఘంలో సభ్యులుగా చేరాలి

14-02-2026 05:27:09 PM

జిల్లా సహకార శాఖ అధికారి సత్యనారాయణ

బెల్లంపల్లి,(విజయక్రాంతి): రైతు ఉత్పత్తిదారుల సంఘం (FPO) లో రైతులు సభ్యులుగా చేరాలని జిల్లా సహకార శాఖ అధికారి (DCO) సత్యనారాయణ (SATHYANARAYANA) కోరారు. శనివారం మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం చంద్రవెల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (PACS) ఆధ్వర్యంలో పెర్కపల్లె గ్రామంలో ఎఫ్‌పిఓ (FPO)పై రైతులకు నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. రైతులు కలిసి సమిష్టి ప్రయోజనాల కోసం ఉత్పత్తి చేసే పంటలను ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (PACS) ద్వారా రైతు ఉత్పత్తిదారుల సంఘాలుగా కేంద్ర ప్రభుత్వం గుర్తించిందన్నారు.

ఉత్పత్తులను మార్కెటింగ్ చేసుకోవడానికి రైతులు సభ్యులుగా చేరడంతో ఆర్థికంగా బలోపేతం కావచ్చని సూచించారు. రైతులు రూ. 2 వేలు వాటాగా చెల్లించి రైతు ఉత్పత్తిదారుల సంఘం (ఎఫ్‌పిఓ)లో సభ్యత్వం పొందవచ్చని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పలువురు రైతులకు సభ్యత్వం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏరియా ఆఫీసర్ జీ సందీప్ కుమార్, జూనియర్ ఇన్‌స్పెక్టర్ బీ సురేందర్, కార్యదర్శులు రాజేష్ గౌడ్, వెంకటస్వామి, స్టాఫ్ అసిస్టెంట్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.